తమిళ ప్రజలు ఒక నటుడ్ని అభిమనించారంటే వాళ్లని సాక్షాత్తు దైవంగానే భావించి గుడి కట్టి మరీ పూజిస్తారు. ఇక తమిళనాట రజనీకి ఉన్న ఫ్యాన్స్ ఆయన పట్ల చూపించే అభిమానం వర్ణనాతీతం. దీనితో రజినీకాంత్ రాజకీయాలలోకి వస్తే చాలు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే రజినీకాంత్ ఈమధ్య తాను అయోమయానికి లోనవుతూ తన అభిమానులను మరింత అయోమయానికి లోనుచేస్తున్న వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఈ అయోమయ వ్యవహారమే రజినీకాంత్ వీరాభిమానులకు ప్రస్తుతం తీరని అసహనాన్ని కలిగిస్తోంది అంటే రజినీ ఏస్థాయిలో తన అభిమానులను అసహనానికి గురిచేస్తున్నాడో అర్ధం అవుతుంది. దీనికి కారణం ఈనెల 12 నుంచి 16వరకూ రజినీ తన ఫ్యాన్స్ తో భేటీ అవుతానని ప్రకటించి ఇప్పుడు రజనీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ఆకస్మికంగా ప్రకటించడంతో రజినీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనై తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు ప్రతి అభిమానితో ఫోటోలు దిగడం సాధ్యం కాదనే సాకు చూపి రజనీ ఇలా మీటింగ్స్ రద్దు చేయడం పై అభిమానులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రజినీకాంత్ తమతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటూ ఘాటైన కామెంట్స్ కూడ సోషల్ మీడియాలో పెడుతున్నారు. రజినీకాంత్ మొదట్లో తన అభిమానులకు జోష్ ను కలిగించడానికి ప్రతి అభిమానితో ఫోటోలు తీయించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా చివరిలో ఇలాంటి కార్యక్రమాలు వల్ల లక్షలాది సంఖ్యలో వచ్చే అభిమానులను సంతృప్తి పరచలేము అన్న ఉద్దేశ్యంతో  ఈ సమావేశం రద్దు చేస్తున్నామని ప్రకటించినట్లు టాక్.

భవిష్యత్తులో జిల్లాల వారీగా మీటింగ్స్ పెట్టుకుందామని రజనీ చెప్పినట్టు ఈ ప్రకటనలో ఉంది. ఒక్కో అభిమానితో ఫొటో దిగాల్సి రావడం రజనీకాంత్‌ లాంటి సూపర్‌ స్టార్‌కే కాదు, చిన్నా స్థాయి హీరోలకీ కూడా అసాధ్యమైన పరిస్థుతులలో ఇటువంటి అనాలోచిత నిర్ణయం రజనీకాంత్‌ ఎందుకు తీసుకున్నాడు అని అతడి సన్నిహితులే విమర్శిస్తున్నట్లు టాక్. 

దీనితో తన అభిమానులందరినీ చెన్నై వచ్చేయవలసిందిగా పిలుపు ఇచ్చి రజినీకాంత్ పెద్ద తప్పు చేసాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఈమధ్య కాలంలో తన రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడిపోతున్న రజినీ వ్యవహార శైలి వల్ల అతడి ఇమేజ్ బాగా తగ్గిపోయే ఆస్కారం ఉంది అని అతడి సన్నిహితులు రజినీకాంత్ కు సూచనలు చేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: