గత శుక్రువారం విడుదలై భయంకరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘యుద్ధం శరణం’ మూవీకి రాజమౌళి కొడుకు కార్తికేయ అనుసరించిన అత్యుత్సాహ వ్యూహాలు బెడిసి కొట్టాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాకు సాయి కొర్రపాటి నిర్మాత అయినా ఈసినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కార్తికేయ అనుసరించిన ఎత్తుగడలు ఈసినిమాకు శాపంగా మారాయి అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

వాస్తవానికి ఈసినిమా కథ చాలామంది నిర్మాతల చుట్టూ తిరిగి చిట్టచివరకు సాయి కొర్రపాటి దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఈకథకు కార్తికేయ చాల మంచి మార్కులు వేయడంతో ఈసినిమాను నిర్మించాడని టాక్. వాస్తవానికి ఈసినిమాకు దర్శకుడుగా కృష్ణ మరియముత్తు వ్యవహరించినా చాల విషయాలలో కార్తికేయ సలహాలు ఈసినిమా కథ పై ప్రభావం చూపించినట్లు టాక్. 

దీనికితోడు ఈసినిమా స్క్రీన్ ప్లే విషయంలో కూడ అనేక మార్పులు చేర్పులు కార్తికేయ సలహాలతో జరిగినట్లు టాక్. దీనికితోడు నాగచైతన్యకు ఈసినిమా దర్శకుడు కృష్ణకు ఉన్న స్నేహం రీత్యా కూడ చైతూ ఈమూవీ విషయాల పై కార్తికేయ దర్శకుడు కృష్ణ మరియ ముత్తులకు పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు సమాచారం. 

అయితే ఈసినిమా ఫైనల్ కాపీని ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసిన నాగార్జున ఈ సినిమా పై ఈసినిమా విడుదలకు ముందే తన పూర్తి అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు టాక్. ఈ మూవీకి చెప్పుకో తగ్గ స్థాయిలో బిజినెస్ అవ్వని నేపధ్యంలో ఈమూవీని నిర్మించిన సాయి కొర్రపాటికి తీవ్ర నష్టాలు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కార్తికేయకు చెడ్డ పేరు చిట్టచివరకు ఈ యుద్ధం శరణం మిగిల్చింది అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: