ఈనెలాఖరున నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీతో పోటీగా విడుదల అవుతున్న నాగ శౌర్య మూవీ ‘@నర్తనశాల' గురించి ఒక సీక్రెట్ లేటెస్ట్ గా బయటపడింది. ఈమూవీకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ చక్రవర్తి మొదటగా ఈకథను రాసుకున్నప్పుడు హీరో నాగశౌర్య కాడు. 

ఒకప్పటి ఫ్యామిలీ సినిమాలకు హాస్య సినిమాలకు చిరునామాగా కొంత కాలం సక్సస్ లను ఎంజాయ్ చేసిన వేణు తొట్టెంపూడి అని తెలుస్తోంది. ఈకథ వేణుకి నచ్చినా ఎందుకో ఆసినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.  దీనితో శ్రీనివాస్ చక్రవర్తి కథకు యంగ్ హీరోలకు సూటయ్యేలా కొద్ది మార్పుచేర్పులు చేసి నాగశౌర్యను కలిశాడట. 
will nagashourya get success with short film
'ఛలో' తర్వాత ఆమూవీ సక్సస్ తో ఏదైనా డిఫరెంట్ స్టోరీ చేయాలనే ఆలోచనలో ఉన్న నాగశౌర్యకు ఈ గే షేడ్స్ ఉన్న కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తన హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పై నిర్మించేందుకు ముందుకొచ్చాడు అనితెలుస్తోంది. ఈసినిమా కథ మీద ఉన్న నమ్మకంతో తన మార్కెట్ కంటే ఎక్కువగా 15 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడమే కాకుండా సుమారు 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ తో పోటీగా విడుదలచేయడం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా నాగశౌర్య మితిమీరిన విశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

నాగశౌర్య మోడరన్  బృహన్నల యాక్టింగ్ స్కిల్స్ కు మంచి మార్కులే పడుతున్నా ఒకప్పటి హీరో వేణు కోసం వ్రాసిన కథ ఈనాటితరం యంగ్ హీరోకి ఎంతవరకు సరిపోతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చైతూలోని మాస్ ఇమేజ్ ని బయటపెట్టి రొమాంటిక్ హీరో యాంగిల్ ని ఎలివేట్ చేసేందుకు తీసిన ‘శైలజా రెడ్డి’ ముందు నాగ శౌర్య గే ప్రయోగం సక్సస్ అయితే ఈయంగ్ హీరోకి మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఓవర్సీస్ లో యువహీరోల హవా సాగుతున్న వేళ `ఛలో` చిత్రంతో విదేశాల్లో శౌర్య ఇమేజ్ పెంచుకున్న నేపధ్యంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ రిలీజ్ కి ఒకరోజు ముందే ‘నర్తనశాల’ ను రిలీజ్ చేస్తు నాగశౌర్య చేస్తున్న సాహసం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: