అత్తారింటికిదారేది మూవీ బాక్సాపీస్ రికార్డులను తిరగరాస్తుంటే, మరో పక్క అదే రేంజ్లో డామేజ్ జరుగుతుంది. అత్తారింటికి దారేది లీక్డ్ వీడియోతో పవన్ మూవీకు ఎక్స్ట్రా పబ్లిసిటి వచ్చింది తప్పితే, కలెక్షన్స్‌పై చీమంత కూడ ఎఫెక్ట్‌ను చూపించలేకపోయింది. లీక్డ్ మూవీ పబ్లిసిటి పుణ్యమా అంటూ మూవీకు విపరీతమైన ఆధరణ పెరిగి, అన్నిచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో అధరగొడుతుంది. ఇప్పుడు అందరినోటా అత్తారింటికిదారేది బాక్సాపీస్ కలెక్షన్స్ టాకే. ఇదిలా ఉంటే ఈ సందడిలో పైరసీ భారీ అవతారం ఎత్తింది. మొన్నటి వరకూ 90 నిముషాలు విడుదలైన పైరసీ, ఇప్పుడు ఫుల్ లెన్త్ మూవీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది.
మూవీ రిలీజ్ అయింది కాబట్టి, ఇక మమ్మల్ని ఆపేది ఎవడంటూ ఫుల్లెన్త్ మూవీ విచ్చలవిడిగా విజృంభిస్తుందంటున్నారు నెటిజెన్లు. ఈ పుల్ మూవీతో కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి యాంటి పైరసీ సెల్ ఈ సమయంలో మరింత వేగవంతంగా పైరసీ మీద శ్రద్ధ చూపాలని అభిమానులు అంటున్నారు. మొన్నటి వరకూ మిగతా సగం ఏమయ్యిందో అన్న డౌటు అందరిలో ఉంది. ఇప్పుడు అదే క్వాలిటీలో, మిగతా సగం కూడ ప్రత్యక్షం కావడంతో నిర్మాతలకు దీన్ని ఎలా అరికట్టాలో అర్ధంకావడంలేదు. ఏదైమైనా పైరసీను ఎవరూ ఎంకరేజ్ చేయకూడదని టాలీవుడ్ సిన్సియర్‌గా అందరికి చెబుతుంది.