సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సక్సస్స్ ను ఎంజాయ్ చేస్తూ తన ఫ్యామిలీతో ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను నమ్రత మహేష్ అభిమానులకోసం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఈ నేపధ్యంలో నమ్రత లేటెస్ట్ గా షేర్ చేసిన ఒక ఫోటో పై కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోలో మహేష్ బాబు సితార గౌతమ్ లు ఉన్నారు. అయితే ఈ ఫోటోలో మహేష్ క్లీన్ షేవ్ లో కనిపిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అలాంటి లుక్ తోనే తన లేటెస్ట్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో కనిపిస్తాడా అంటూ చర్చలు జరుగుతున్నాయి.
దీనితో అనీల్ రావిపూడి తన మూవీ కోసం మహేష్ కు సంబంధించి ఎటువంటి కొత్త లుక్ ను డిజైన్ చేయలేదని ఎప్పటిలాగే మహేష్ తన పూర్వ రూపంతో కనిపిస్తాడు అన్న విషయాన్ని అభిమానులకు లీక్ చేయడానికి నమ్రత ఇలా ప్రవర్తించి ఉంటుంది అని అంటున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆమె చేసిన కొన్ని కామెంట్స్ పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి.
"నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులు చాలా కూల్ #లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ #సెలేబ్రేటింగ్ మహర్షి" అంటూ నమ్రత క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోను షేర్ చేసింది. అయితే ఆమె ప్రతి పదానికి మధ్యన ఒక సింబల్ ను పెట్టి మహేష్ సూపర్ స్టార్ అన్న భావన క్రియేట్ చేస్తోందా అంటూ నమ్రత అత్యుత్సాహం పై విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి