బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. ఈ సినిమా టీజర్ ఈరోజు
రిలీజ్ కాబోతున్నది. ఉదయం 11 గంటల సమయంలో టీజర్ ను రిలీజ్
చేయబోతున్నారు. దీని గురించే అందరు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నాడు
సుజిత్.
రన్ రాజా రన్ వంటి రొమాంటిక్
ఎంటర్టైనర్ తరువాత సుజిత్ చేస్తున్న రెండో సినిమా ఇది. మన టాలీవుడ్ లో ఓ
సెంటిమెంట్ ఉంది. రెండో సినిమా ఎవరికి పెద్దగా కలిసిరాలేదు. చాలామంది
ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టినా సెకండ్ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఢమాల్
అంటుంటారు.
రాజమౌళి, శివ నిర్వాణ వంటి కొందరు ఈ
గండం నుంచి బయటపడ్డారు. మరి సుజిత్ కూడా ఈ గండం నుంచి బయటపడతాడా అన్నది
చూడాలి. పైగా ఇచ్చిన రెండో సినిమా భారీ బడ్జెట్ సినిమా. బాహుబలి సినిమా
తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా.
ఈ సినిమాకు
అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతటి భారీ స్థాయిలో నిర్మిస్తమౌతున్న ఈ సినిమాను
సుజిత్ ఎలా డీల్ చేశాడు అన్నది అందరిలోనూ కలుగుతున్న ప్రశ్న. దానికి
సమాధానం మరికొద్ది సేపట్లోనే తేలిపోనున్నది.