రాజకీయాలకు చాల దూరంగా ఉండే మహేష్ సామాజిక కార్యక్రమాలలో ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించి గుండె జబ్బుల నివారణ కోసం చేపట్టే వైద్య కార్యక్రమాలలో వారికి తలెత్తే ఆరోగ్య సమస్యల వల్ల చేయవలసి వచ్చిన గుండె ఆపరేషన్స్ కు మహేష్ నమ్రత దంపతులు చాల ఉదారంగా సేవ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా రెయిన్ బో హాస్పటల్ ఆంధ్రప్రదేశ్ లోని అనేక హాస్పటల్స్ నిర్వహించే చిన్న పిల్లల గుండె ఆపరేషన్ కు సంబంధించి ఆ హాస్పటల్ యాజమాన్యాలు పెట్టె ఖర్చులో చాల భాగం భరిస్తూ ఉంటాడు. 

ఇలా మహేష్ చేయడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. మహేష్ కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు అతడు గుండె సంబంధిత సమస్యతో పుట్టాడు. అప్పట్లో గౌతమ్ కు సర్జరీ చేయడం దానివల్ల మహేష్ విపరీతమైన టెన్షన్ పడటం జరిగింది. అలాంటి పరిస్థితులలో చాలామంది చిన్నారులు మన దేశంలో పుడుతున్నారని మహేష్ అనుభవపూర్వకంగా తెలుసుకుని అప్పటి నుండి చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కు చాల వరకు ఆర్ధిక సహాయం చేస్తున్నాడు. 

ఇప్పటి వరకు అలాంటి సర్జరీలు చేయించుకున్న 1000 మంది ఆపరేషన్ ఖర్చులను మహేష్ భరించాడు అన్న విషయాన్ని నమ్రత చాల గర్వంగా మహేష్ అభిమానులకు షేర్ చేసింది. అంతేకాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తన తండ్రి పుట్టిన ఊరును అదేవిధంగా తన అమ్ముమ్మ పుట్టిన ఊరును దత్తత తీసుకుని చాల సేవా కార్యక్రమాలు మహేష్ చేస్తున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం మహేష్ అనేక వ్యాపారాలు చేస్తూ వివిధ రంగాలలో రాణించడమే కాకుండా చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ కోసం భారీగా ఇస్తున్న విరాళాలు మహేష్ అభిమానులలో హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా మహేష్ సూపర్ స్టార్ అంటూ మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: