అసలు సిసలైన కథకు అవసరమైన గ్రాఫిక్స్ జోడిస్తే.. ఆ సినిమా బంపర్ హిట్ అవుతుంది. అందులోనూ హార్రర్, యాక్షన్ సినిమాలకు గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అంతులేని బలాన్నిస్తాయి. ఈ విషయాన్ని ఇప్పటికే దర్శకుడు కోడి రామకృష్ణ తన సినిమాల ద్వారా నిరూపించారు.


అమ్మోరు, అరుంధతి వంటి సినిమాలు గ్రాఫిక్స్ హంగులతో ప్రేక్షకులను ఎంతగా అలరించాయో అందరికీ తెలిసిందే.. ప్రత్యేకించి అరుంధతి సినిమాలో నటీ నటుల నటనకు దీటుగా గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే కోవలో మరో సినిమా వస్తోంది. అదే ఎర్రచీర. మ‌ద‌ర్ సెంటిమెంట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిత‌మ‌వుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఎర్రచీర. కథ దృష్ట్యా ఈ సినిమాకు గ్రాఫిక్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.


కథను మరింత బలంగా చెప్పేందుకు గ్రాఫిక్స్ సహాయం తీసుకుంటున్నామని సినిమా యూనిట్ తెలియజేసింది. బేబి ఢ‌మ‌రి స‌మ‌ర్పణ‌లో, శ్రీసుమ‌న్ వెంక‌టాద్రి ప్రొడ‌క్షన్ ప‌తాకంపై సి.హెచ్ స‌త్యసుమ‌న్ బాబు గారి స్వీయ ద‌ర్శక‌త్వంలో బేబి సాయితేజ‌శ్విని, శ్రీకాంత్ ప్రధాన పాత్రల‌లో నిర్మిత‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే.


హ‌ర్రర్‌, యాక్షన్‌, స‌స్పెన్స్ ల‌తో కూడిన క‌థ కావ‌డంతో గ్రాఫిక్స్ ముఖ్య భూమిక‌ను పోషించ‌నున్నాయి. ద‌ర్శకులు సి. హెచ్‌. స‌త్య సుమ‌న్ బాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుత‌మైన గ్రాఫిక్స్ తో ఎర్ర చీర చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. గతంలో అనేక సినిమాలు గ్రాఫిక్స్ ఆధారంగా మంచి హిట్ సాధించాయని.. తమ చిత్రం కూడా అదే కోవలో ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ ఎర్రచీర చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ తోట స‌తీష్‌, మాట‌లుః గోపీ విమ‌ల పుత్ర‌, ఫైట్స్ః నందు, కెమెరాః చందు, ఆర్ట్ః సుభాష్‌, నాని, సంగీతం - ప్రమోద్ పులిగిల్ల అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: