టాలీవుడ్ లో తండ్రి వారసత్వంగా నటననే కాదు క్రేజ్ కూడా సంపాదించిన హీరో మహేశ్ బాబు. ప్రిన్స్ మహేశ్ గా మొదలుపెట్టిన ప్రస్థానం సూపర్ స్టార్ మహేశ్ గా కొనసాగుతోంది. ఆయన ఇరవై అయిదేళ్ల కెరీర్ లో ఛాలెంజింగ్ పాత్రలెన్నో చేశాడు. యూత్, ఫ్యామిలీ, సీరియస్.. క్యారెక్టర్లెన్నో చేశాడు మహేశ్. అయనలోని విభిన్న కోణాన్ని ఆవిష్కరించిన సినిమాగా చెప్పాలంటే ఖలేజా గురించి చెప్పాలి. కామెడీతో పాటు సీరియస్ పాత్రలో మెప్పించాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మహేశ్ ను కొత్తగా ప్రెజంట్ చేసిన సినిమా ఖలేజా.

 

 

ఇప్పుడు అదే కోణంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి అనౌన్స్ చేసినట్టు సినిమాలో కామెడీని దిట్టంగా చొప్పించారట. ఓ పక్క మహేశ్ మిలిటరీ ఆఫీసర్ గా సూపర్ లుక్ లో సీరియస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. కానీ.. సినిమా మాత్రం కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్. ఇదే నిజమైతే మహేశ్ లోని కామెడీ టైమింగ్ మరోసారి ప్రేక్షకులను అలరించబోతోందనే చెప్పాలి. ఖలేజాలో మహేశ్ చేసిన కామెడీ ఇప్పటికీ హైలైట్. టీవీల్లో ఇప్పటికీ ఈ సినిమా ప్లే అయితే మహేశ్ కామెడీకి మంచి అప్లాజ్ ఉంటుంది. దీనినే అనిల్ రావిపూడి ఉపయోగించుకుని మహేశ్ లోని కామెడీ టైమింగ్ ను బయటకు తీశాడంటున్నారు.

 

 

సీరియస్ పాత్ర ఏదైనా మహేశ్ కు కొట్టిన పిండే అని తెలిసిందే. కామెడీ చేస్తే ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. ఓ కొత్త జోనర్ ను మహేశ్ లో చూసే అవకాశం ఉంటుంది. మహేశ్ లోని ఈ రెండు కోణాల్ని అనిల్ సరిగ్గా ఉపయోగించుకుంటే మహేశ్ ఫ్యాన్స్ కు ప్రేక్షకులకు సరిలేరు నీకెవ్వరుతో పండుగ సంబరాల్ని, హాస్య రుచుల్ని అందించిన వారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: