మహానటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కీర్తి సురేష్ దక్షిణాది తో పాటు దేశవ్యాప్తంగా ఎంతగా ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క సినిమా సక్సస్ కీర్తికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో కీర్తి కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ని ఏలడం ఖాయమని ప్రతీ ఒక్కరు ఫిక్సైపోయారు. ఇంత అందగత్తే మళ్ళీ ఇప్పుడప్పుడే తెలుగు ఇండస్ట్రీకి దొరకదని దర్శక, నిర్మాతలు ఆరాట పడ్డారు. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి! మహానటి సినిమా టైమ్ లోనే కొన్ని తమిళ్ సినిమాలు కమిట్ అవ్వడంతో..అదే సమయంలో కారణం లేకుండానే తెలుగులో పెద్ద బ్యానర్స్ నుండి వచ్చిన అవకాశాలను వదులుకుందని ప్రచారం సాగింది. మహానటిగా తనకు కలిసొచ్చిన ఇమేజ్ ను ఎందుకు వాడుకోలేపోయింది? పక్కా ప్లాన్స్ లేకపోవడమా? లేక మళ్ళీ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ పడితే పరిస్థితేంటని వెనకడుగు వేసిందా..అంటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

 

అయితే తెలుగు సినిమా అంటే అందాలు విందు చేయాలనే నిబంధన ఉంటుంది కాబట్టి...ఆ కారణంగానే వచ్చిన అవకాశాలు వదులుకుంటోందని ఎప్పటి నుంచో ఒక టాక్ ఉంది. కనీసం గ్లామరస్ గా అయినా స్క్రీన్ మీద కనిపించి ఆకట్టుకోవాలి. సాంగ్స్ లోనైనా అంతో ఇంతో ఎక్స్‌ఫోజింగ్ చేయాలి. అవన్నీ కాదని చెప్పడం ఒక కారణం. అయితే ఆ కారణంతో పాటు.. మరో రీజన్ కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు- తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తున్నా స్టార్ హీరోల్లో వచ్చిన అవకాశాలను వదులుకోవడనాకి అసలు కారణం ఇదేనంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

 

కీర్తి స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్లిన ఏ దర్శకుడు విషయంలోనైనా ముందు తన పాత్ర..తెరపై  కనిపించడానికి ఎంతసేపు ఆస్కారం ఉంటుంది? ఆ పాత్ర ఎంత వరకూ తన భవిష్యత్ కు ఉపయోగపడుతుంది? సినిమా బడ్జెట్ ఎంత? అందులో తన రెమ్యూనరేషన్ ఎంతిస్తారు.. అంటూ ఆరాలు తీస్తుందట. వీటితో పాటు దర్శకనిర్మాతలకు తన వ్యక్తిగత కండిషన్లు చెబుతోందట. అయితే గ్లామర్ షో విషయం పక్కన బెడితే అవకాశాలు కోల్పోవడంలో అసలు పాత్ర పోషించేవి ఈ రీజన్సే అని కొందరు చెప్పుకుంటున్నారు. అవన్నీ పట్టించుకోకుండా తెలుగు సినిమాలను సెలెక్ట్ చేసుకుంటే.. సెట్స్ కు వెళ్లిన తర్వాత ఈ బ్యూటితో ఇంకెన్ని ఇబ్బందుల ఎదురవుతాయోనని మేకర్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారట. అందుకనే కీర్తి వైపు టాలీవుడ్ నుంచి ఏ దర్శకనిర్మాతా చూడడంలేదని తాజా సమాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరక్కార్ - మైదాన్- గుడ్ లక్ సఖి అనే సినిమాలలోనూ నటిస్తోంది. కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమా మాత్రమే చేతిలో ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: