జబర్దస్త్ లో ఒక నార్మల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో జబర్దస్త్ టీం లీడర్ గా ఎదిగాడు సుడిగాలి సుధీర్. ఇక ఆ తర్వాత హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించి దూసుకుపోయాడు. ఒక కామెడీ తోనే కాకుండా యాంకరింగ్ చేస్తూ అందర్నీ మెస్మరైజ్ చేయడమే కాకుండా... మ్యాజిక్ షో లో అందరినీ ఆశ్చర్య పరిచే వాడు సుధీర్. ఇక తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఔరా అనిపించే వాడు సుధీర్. ఇలా ప్రతి దాంట్లో తన సత్తా చాటుకుంటు జబర్దస్త్ లో ఏ కమెడియన్ కి లేనంత క్రేజ్ సంపాదించాడు సుడిగాలి సుదీర్. రఅటు జబర్దస్తు లో ప్రతివారం బుల్లితెరపై నవ్వుల సందడి చేస్తూనే ఉంటాడు. ఇక జబర్దస్త్ ద్వారా సినిమా అవకాశాలను అంది పుచ్చుకుంటూ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు సుడిగాలి సుదీర్. మాది విజయవాడ... నేను పుట్టింది పెరిగింది అక్కడే... నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ షోలన్న, మ్యాజిక్ షోలన్న చాలా ఆసక్తి ఉండేది. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మ్యాజిక్ షో లు చేస్తూ ఉండే వాడిని... మరోవైపు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుంటూ వచ్చాను. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో... మా నాన్నకి రోడ్డు ప్రమాదం జరిగింది. మా నాన్నకు కాలు విరిగి పోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక మా నాన్న షుగర్ పేషెంట్ కావడంతో నా రూట్ మార్చుకోక తప్పలేదు. చిన్నపిల్లలకి డాన్స్ క్లాసులు చెబుతూ డాన్స్ క్లాస్ ల ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబానికి అండగా నిలిచేవాన్ని. ఆ తర్వాత సిటీకి వచ్చి మ్యాజిక్ షోలు చేసేవాణ్ని. జబర్దస్త్ కి వచ్చాక మా లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మా నాన్నని ఏ పని కూడా చేయడం లేదు అంటూ సుడిగాలి సుధీర్ తన స్టోరీ చెప్పుకొచ్చాడు. గతంలో కూడా అవకాశాలు లేనప్పుడు సుడిగాలి సుదీర్ ఎలాంటి కష్టాలు పడ్డాడో కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సుడిగాలి సుదీర్ ప్రస్తుతం హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా సాఫ్ట్వేర్ సుధీర్. ఏ సినిమా ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.