ప్రస్తుతం  సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలు  బాక్సింగ్ ఆఫీసు ప్రదర్శన విషయానికి వస్తే ఆశాజనకంగా లేవు. రోబో తరువాత, బాక్స్ ఆఫీస్   దగ్గర రజిని ఏ చిత్రం కూడా మంచి ఫలితాలను ఇవ్వ లేదు.  రజిని  చివరి చిత్రం పేటాకు ప్రజల నుంచి   మంచి స్పందన వచ్చినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో తగినంత థియేటర్లు లేకపోవడం, ఆ చిత్ర  కలెక్షన్ల ప్రవాహానికి ఆటంకం కలిగించాయి. దీనితో  రజినీ యొక్క తాజా చిత్రం దర్బార్ తక్కువ అంచనాలను కలిగి ఉంది. తెలుగు మీడియా కూడా ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల కాబోయే భారీ బడ్జెట్ చిత్రాలైన  అలా వైకుంఠ పురంలో ,  సరిలేరు నీకెవ్వరూ చిత్రాలకు   పోటీగా భావించలేదు. దర్బార్ చిత్ర  ట్రైలర్ విడుదల తర్వాత పరిస్థితులు ఒక్క సరిగా మారిపోయాయి.

 

 

 

 

 

 

 

 

 

 

దర్బార్ చిత్ర  ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలను కలిగి వుంది.  ఈ చిత్రం  ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్లస్ స్టోరీ  పొలిసు పాత్ర  నేపథ్యంలో నడుస్తుంది, పొలిసు   కథ నేపధ్యంగా ఇప్పటి వరకు వచ్చిన   చిత్రాలన్నీ  ఘన విజయాన్ని సాధించాయి. రజని మానియా  ఈ చిత్రం లో  కనిపిస్తుంది. థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై సరైన అంచనాలను నెలకొల్పింది.   ట్రేడ్ ఎనలిస్టులు   మహేష్ బాబు, అల్లు అర్జున్ చిత్రాలకు , రజిని  దర్బార్ గట్టి పోటీని ఇవ్వబోతుందని  భావిస్తున్నారు.

 

 

 

 

 

 

తెలుగు సినిమా వ్యాపారానికి గుండెగా భావించే నిజాం ప్రాంతంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నందున ఈసారి ఈ చిత్రానికి  థియేటర్ల  సమస్య ఉండదు. ఎ.ఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నయనతార  కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సునీల్ శెట్టి విలన్ పాత్రలో కనిపిస్తారు.   దర్బార్ చిత్రం జనవరి  9 లేక  10 న  విడుదల అవుతుంది, త్వరలో ఈ  రెండు రోజుల్లో ఎదో ఒక రోజు నిర్ధారించబడుతుంది. జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ  , అలా వైకుంఠ పురంలో జనవరి 12 న విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: