తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ అభిమానులందరూ యంగ్ రెబల్ స్టార్ గా మారిపోయాడు  ప్రభాస్. ఒక రాజుగా ఒక లవర్ బాయ్ గా ఒక బాధ్యతగల పౌరుడిగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. కాగా  ప్రభాస్ కెరీర్ లో తనను  తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గర చేసిన సినిమా చత్రపతి. ఈ సినిమాలో ప్రతి సెకండ్ హైలెట్ గా నిలుస్తుంది. చత్రపతి శివాజీ(ప్రభాస్ ) నివసిస్తున్న ప్రాంతం వద్దకు వచ్చిన పిల్లలందరినీ తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన విలన్ని చంపిన చత్రపతి శివాజీ... శవాన్ని  లాక్కెళ్ళి రాజకీయ నాయకుడు అప్పలనాయుడు దగ్గర అప్పగిస్తూ.. వాడు కాక పోతే వీడు.. వీడు కాకపోతే నేను.. నేను కాకపోతే నా అమ్మ మొగుడంటూ  ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అంటూ డైలాగ్ చెప్తుంటే సగటు ప్రేక్షకుడి రక్తం మరిగి పోతుంటుంది.. చత్రపతి సినిమాలో ప్రభాస్ చూపించిన హీరోఇజాన్ని  ఎన్నటికీ తెలుగు ప్రేక్షకులు మరవ బోరు.

 

 

 

 ఇక మిర్చి లో ఒక లవర్ బాయ్ గా నటించినప్పటికీ తనదైన స్టైల్ ఫైట్లతో అభిమానులందరినీ హోరెత్తించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. విలన్ కుటుంబాన్ని మార్చడానికి హీరోయిన్ సాయంతో విలన్ ఇంట్లో చేరతాడు ప్రభాస్. ఈ క్రమంలోనే విలన్ ఇంటి సభ్యులకు ప్రభాస్ తన శత్రువు అని తెలిసిపోతుంది. ఈ సందర్బంగా జరిగిన  ఫైట్ లో...  పదే పది నిమిషాలు పాత మనిషి అయితే ఇక్కడ ఒక్కడు కూడా ప్రాణాలతో  మిగలడు... కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడ లేడు..వీలైతే ప్రేమిద్దాం రా మహా అయితే తిరిగి ప్రేమిస్తారు  అంటూ ప్రభాస్ ఉరుము లాంటి కంఠంతో రౌద్ర రసాన్ని పోషిస్తూ డైలాగ్ చెబుతూ ఉంటే ప్రేక్షకుడి గుండె 100 స్పీడులో కొట్టుకుంటుంది. ఇక మిర్చి సినిమాలో మరోసారి డైలాగ్ కూడా  ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 600 గడపలు ఓ పెద్దాయనను  నమ్ముకొని ధైర్యంగా బతుకుతున్నాయి...అరుగురినేసుకొచ్చి  ఆ  ధైర్యాన్ని బయటపెడతామని  ఎలా అనుకున్నార్రా  అంటూ ప్రభాస్ గంభీర ఆహార్యంతో కారు అద్దం పై చేయి పెడితే చాలు మొత్తం బీటలు వారుతుంటే  సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ హోరెత్తిపోయారు .

 

 

 

 ఇక ప్రభాస్ నటించిన బాహుబలి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శత్రువులు అందరూ తన సైనికులను చీల్చి చెండాడుతూ ఉన్న సమయంలో తన సైనికులందరూ మరణం మరణం అంటూ మరణ భయంతో పరుగులు తీస్తుంటే... సైనికుల అందరిలో ధైర్యాన్ని నింపేందుకు... మహాసేన.. ఏది మరణం... మన గుండె ధైర్యం కన్నా శత్రుసైన్యం పెద్దది అనుకోవడం మరణం... రణరంగంలో చావుకన్నా పిరికితనంతో బ్రతికి ఉండడం మరణం... మన తల్లిని అవమానించిన నీచుడు ఎదురుగా నిలబడి నవ్వుతూ చూస్తుంటే.. వాడి తల నరికి ఆమె పాదాల కింద పెట్టకుండా పారిపోవడం మరణం.. నా తల్లి ని అవమానించిన నీచుడు చంపడానికి నేను వెళ్తున్నాను అంటూ రాజాఠివితో  గంభీర ఆహార్యంతో ఉరుములాంటి  కంఠంతో రౌద్ర రసాన్ని పోషిస్తూ ప్రభాస్ డైలాగులు చెబుతూ ఉంటే సగటు ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకొని.. ఆ సీన్ చూసేందుకు వేవేల కన్నులు కూడా చాలవు అనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: