టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకపోతే ఓవైపు చిరంజీవి మరోవైపు 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మరోవైపు ఎవర్ గ్రీన్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే స్టేజ్ పై సందడి చేయడంతో ఈవెంట్ సక్సెస్ అయి పోయింది. ఇకపోతే తన వాక్చాతుర్యంతో ఎలాంటి ఈవెంట్ నైనా రక్తికట్టించగల యాంకర్ సుమ ఈ ఈవెంట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు . 

 

 

 

 ఇకపోతే ఈ ఈవెంట్లో భాగంగా యాంకర్ సుమ చెప్పిన డైలాగ్ తో  ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం సుమ పై గుర్రుగా ఉంది. సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ జరుగుతున్న సమయంలో సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా వచ్చి స్టేజిమీదకి వచ్చి  సినిమా గురించి సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ప్రసంగాన్ని ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నను  స్టేజి మీదికి పిలిచింది యాంకర్ సుమ. ఇక నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా స్టేజి మీదికి వచ్చిన రష్మిక ఓ నాలుగు డైలాగులు మాట్లాడింది. ఆ తర్వాత మహేష్ అభిమానులను చూస్తుంటే తనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని ఎక్సైట్ మెంట్ తో చెప్పింది. దీంతో పక్కనే ఉన్న సుమ అందుకొని పర్వాలేదు మాట్లాడు ఎవరి డబ్బాలు వాళ్ళు  కొట్టుకోవాలి మీరు మాట్లాడండి అనేసింది సుమా. ఇక ఆ తర్వాత రష్మిక  కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. 

 

 

 

 అయితే సుమ చెప్పిన డైలాగు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ మొత్తాన్ని  సుమ ఆ ఒక్క డైలాగ్ తో  అవమానించారని స్టేజి మీదికి వచ్చే వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు అని  సుమ ఎలా అంటారు అని ప్రశ్నిస్తున్నారు టాలీవుడ్ వర్గాలు. యాంకర్ గా సుమ కి ఎంతో మంచి పేరు ఉంది. ఎలాంటి ఈవెంట్ అయిన  తన వాక్చాతుర్యంతో హోమ్లీగా నడిపిస్తారని పాజిటివ్ టాక్ ఉంది కానీ... అక్కడున్న ప్రముఖులు అందరి పరువు తీసేలా సుమ అలా మాట్లాడడం ఏంటని ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై సుమ మాత్రం స్పందించలేదు ఏ ఉద్దేశంతో అలా అన్నారో  అన్నది మాత్రం చెప్పలేదు. ఏదేమైనా సుమ అన్న మాట  మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: