ఇప్పుడిప్పుడే సంక్రాంతి సినిమాల సంద‌డి త‌గ్గుతూ వ‌స్తోంది. ఈ నెల సంక్రాంతి కానుక‌గా మొత్తం నాలుగు సినిమాలు విడుద‌ల‌వ్వ‌డం.. ప్రేక్ష‌కులు రిజ‌ల్ట్స్‌ ఇవ్వ‌డం అంతా జ‌రిగిపోయింది. ఇక ఈ నెల చివ‌రిలో మ‌రో రెండు సినిమాలు విడుద‌ల కానున్నాయి. అందులో జనవరి 31న విడుద‌ల‌య్యే అశ్వథ్థామ ఒక‌టైతే.. చూసి చూడంగానే మ‌రొక‌టి. మొత్తంగా జ‌న‌వ‌రి మొత్తం అటు మాస్‌.. ఇటు క్లాస్ సినిమాల‌తో టాలీవుడ్ సినీ ల‌వ‌ర్స్‌కు హ్యాపీగా గ‌డిచిపోయింది. అయితే ఇప్పుడు చిక్క‌ల్లా ఫిబ్ర‌వ‌రిపైనే.

 

ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల్లో.. ఓ మూడు సినిమాల గురించి ప్ర‌స్తుతం అంతో ఇంతో యూత్ లో ముచ్చట సాగుతోంది. ఫిబ్రవరి 7న‌ జాను, సవారి చిత్రాలు విడుద‌ల కాగా, ఫిబ్రవరి 14న వరల్డ్ ఫేమస్ లవర్ మ‌రియు ఫిబ్రవరి 21న  భీష్మ చిత్రాలు విడుద‌ల కానున్నాయి. అయితే జాను, వరల్డ్ ఫేమస్ లవర్, భీష్మ చిత్రాల‌పై కొంత మ‌చ్చ‌ట సాగుతోంది. రౌడీ స్టార్, టాలీవుడ్ సెన్సేషన్, యూత్ స్టార్ విజయ్‌ దేవరకొండ, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. 

 

స‌రైన హిట్ కోసం చూస్తున్న‌ విజ‌య్ ఈ సినిమాలో ఓ రచయిత పాత్ర.. పైగా నాలుగు ప్రేమకథలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి క్లాస్ అప్పీల్ కనిపిస్తోంది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు.  శర్వానంద్,సమంత జంటగా ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న జాను పూర్తిగా క్లాస్ అప్పీల్ తో కనిపిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు క్లాస్ అప్పీల్ తో కనిపించాయి. దీంతో మాస్ ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు రీజ్ అవుతుందో చెప్పలేని ప‌రిస్థితి. 

 

ఇక ఫైన‌ల్‌గా నితిన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ భీష్మ. 'సింగల్ ఫరెవర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో యంగ్ బ్యూటి మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండే భీష్ముడి తరహా పాత్రను నితిన్ పోషించబోతున్నాడని తెలుస్తోంది.  వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.  క్లాస్ పోస్టర్ తో ఇప్పటికే యూత్ లో ఆసక్తిని పెంచారు. అయితే ఈ సినిమా కూడా మాస్ ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు రీజ్ అవుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. దీంతో ఇప్పటి వరకూ ప్రమోషన్ మెటీరియల్ పరిశీలిస్తే.. ఫిబ్రవరి సినిమాలేవీ పెద్దగా ఒప్పలేవు అనే అర్థమవుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: