టాలీవుడ్ మచ్ అవైటెడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న  షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా జాయిన్ అయ్యాడు.  ఈలాంగ్ షెడ్యూల్ లో  ఎన్టీఆర్ , చరణ్ , అజయ్ దేవగణ్ లపై కీలక సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు. ఈసందర్భంగా ఈముగ్గురు తో కలిసి ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి  దిగిన ఫోటోలు నిన్నటి నుండి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. 
 
ఈచిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ,చరణ్ కు జోడిగా  బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ కనిపించనున్నారు.  అయితే సినిమాలో ఆలియా రోల్ చాలా చిన్నదట కేవలం రాజమౌళి డైరెక్షన్ లో నటించాలనే కోరిక తోనే ఆలియా  ఈసినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంతేకాని ఆమె పాత్ర కు పెద్దగా ప్రాముఖ్యత లేదట.  ఇక కేవలం రాజమౌళి కోసమే  సినిమా కు ఒప్పుకోవడం తో రాజమౌళి కూడా ఆమె కోసం  ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆలియా పాత్ర నిడివి తక్కువగా  ఉండడం తో సినిమాలో స్పెషల్ సాంగ్   ఉండేలా చూస్తున్నాడట. ఈసాంగ్ ను ఆలియా మీద చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడని  టాక్. 
 
వీరితోపాటు  ఈ చిత్రంలో  సీనియర్ హీరోయిన్ శ్రీయ కూడా ఓపాత్రలో  కనిపించనుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్య్ర సమర యోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత  చరిత్రల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. ఇక  ఈసినిమా విడుదలతేదీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ముందుగా అనుకున్న ప్రకారం జులై 31న ఆర్ఆర్ఆర్ విడుదలకావాల్సి వుంది కానీ గత కొద్దీ రోజుల నుండి దసరా కు విడుదలచేయనున్నారని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: