పవన్ మైత్రీ మూవీస్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమాను చేయబోతున్నాడు అంటూ ఆ మూవీ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ఇవ్వడం పవన్ కు తీవ్ర అసహనాన్ని కల్గించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మైత్రీ మూవీస్ నిర్మాతలను పవన్ తన వద్దకు పిలిపించుకుని తనకు చెప్పకుండా ఎందుకు మీడియాకు లీకులు ఇస్తున్నారు అంటూ క్లాస్ పీకినట్లు టాక్. 

ప్రస్తుతం వరస పెట్టి పవన్ సినిమాలు చేస్తున్నా ఆ సినిమాల విషయాలను ఆ సినిమాల నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఎవరికీ లీక్ చేయవద్దని పవన్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పవన్ షూటింగ్ స్పాట్ లో ఎవర్ని సెల్ ఫోన్స్ పెట్టుకోవద్దని సలహాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి కండిషన్స్ సాధారణంగా రాజమౌళి పెడుతూ ఉంటాడు. ఇప్పుడు పవన్ కూడ రాజమౌళి తరహాలో వ్యవహరిస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ప్రస్తుతం ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారడంతో ఒక ఎమ్.ఎల్.ఏ గా ఒక వ్యక్తి ఎన్నిక కావడానికే కనీసం 30 కోట్లు ఖర్చు పెట్టవలసి వస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒప్పుకుని నటిస్తున్న ఈ మూడు సినిమాలు వల్ల అతడికి వచ్చే 150 కోట్ల పారితోషికం ఎన్నికల ఖర్చుకు ఎక్కడ సరిపోతుంది అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు. దీనితో పవన్ రాజకీయాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ విషయంలోనే కాదు సినిమాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ లోను కన్ఫ్యూజన్ కొనసాగుతోంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్న జనసైనికులను పవన్ సరిగ్గా కాపాడుకోలేకపోతే భవిష్యత్ లో పవన్ కు రాజకీయంగా మరింత నష్టం జరగడమే కాకుండా ఆ నెగిటివ్ ప్రచారం పవన్ సినిమాలకు కూడ నష్టం జరుగుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: