సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరి ఆడియో ఫంక్షన్స్ కి వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా అడిగినా సున్నితంగా తిరస్కరిస్తారు. అలాంటిది తన ఫేవరేట్ టాలీవుడ్ హీరో యంగ్ హీరో నితిన్ ఫంక్షన్ కి మాత్రం పవన్ కళ్యాణ్ హాజరై విషేస్ చెపారు. అప్పటి నుంచి అందరు ఆయన్ని సినిమా ఓపెనింగ్ ఉన్నా, ఆడియో ఫంక్షన్ ఉన్నా, ప్రీరిలీజ్ ఈవెంట్ ఉన్నా బ్రతిమాలి, రిక్వెస్ట్ చేసి ఆహ్వానిస్తున్నారు. ఆయన కూడా తను వస్తే సినిమాకి హై వస్తుంది, హెల్ప్ అవుతుందనుకోవడం తో పిలిచిన వెంటనే హారై చిత్ర యూనిట్ కి విషేస్ చెప్తున్నారు. ఇక ఒక్కసారి గనక తమ సినిమాకి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడితే చాలు అనుకుంటున్నారు. 

 

పవన్ కళ్యాణ్ డియరెస్ట్ ఫ్రెండ్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ పవన్ కి ఒక కథ చెప్పారు. ఎప్పటిలాగే కుదురుగా పవన్ కళ్యాణ్ త్రివిక్రం చెప్పిన కథ మొత్తం అద్భుతంగా ఉంది. మాంచి మాస్ సబ్జెక్ట్. పక్కా హిట్ అయ్యో సినిమా అని చెప్పారు. పవర్ స్టార్ అలా కథ మీద స్టాంప్ వేయగానే వెయ్యోనుగుల బలం వచ్చిన త్రివిక్రం ఉత్సాహంతో అవునా బాబు మరి ఎప్పుడు చేద్దాం..! అని ఆశగా అడిగారు. కానీ కళ్యాణ్ గారు మాత్రం కూల్ గా ఈ కథ నాకంటే ఎన్.టి.ఆర్ కి పర్ఫెక్ట్ గా సూటవుతుందని ఈ కథ ఆయనకి చెప్పండి ..ఆయనకి నచ్చితే ఆయనతోనే చేయండి అంటూ తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఆ తర్వాత ఆ కథ ఎన్.టి.ఆర్ కి చెప్పడం ఆయనకి పిచ్చ పిచ్చగా నచ్చడంతో ..ఆ సినిమా ఓపెనింగ్ కి పవర్ స్టార్ ముఖ్య అథిదిగా రావడం చక చకా జరిగిపోయాయి. ఆ  సూపర్ హిట్ సినిమానే అరవింద సమేత వీర రాఘవ. ఇక్కడ పవన్ వ్యక్తిత్వం, గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 

ఇక కళ్యాన్ గారికి సిగ్గెక్కువ. ఆడియో ఫంక్షన్ గాని మరే ఇతర ఫంక్షన్ కి గాని వస్తే ముసి ముసి నవ్వులు నవ్వుతూ మెలికలు తిరుగుతుంటారు. అంతేకాదు కొన్ని సార్లు అదే చిలిపి నవ్వుతో వేసే సరదా కామెంట్స్ మెగా ఫ్యాన్సే కాదు అందరికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతాయి. అందుకు కారణం సాధారణంగా పవర్ స్టార్ పబ్లిక్ ఫంక్షన్స్ లో ఇలా సరదాగా మాట్లాడరు. అలాంటి ఒక సదర్భంలో పవర్ స్టార్ తన మీద తనే చిన్న సెటైర్ వేసుకొని కడుపుబ్బా నవ్వించారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అథిదిగా వచ్చిన కళ్యాణ్ గారు గాగూల్స్ పెట్టుకునే ఉన్నారు. అలా చాలాసేపు గాగూల్స్ తోనే ఉన్నారు. వేదిక మీదకి వచ్చి మాట్లాడే టప్పుడు కూడా ఆ గాగూల్స్ తియలేదు. దాంతో కొందరు పవర్ స్టార్ ని కళ్ళజోడు తీయరా అని అడగ్గా ఇది స్టైల్ కోసం పెట్టుకుంది కాదు నాకు ఐ ఇన్‌ఫెక్షన్ వచ్చింది అందుకే పెట్టుకున్నా ..అంటూ సరదాగా కామెంట్ చేసి అందరిని నవ్వించారు. ఇదే పవన్ చిలిపి తనం.   

మరింత సమాచారం తెలుసుకోండి: