ఈ మధ్యకాలంలో సినిమాలు అన్నీ రొమాంటిక్ చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు ముద్దులు హగ్గులతో సినిమాలు వచ్చేవి ఇప్పుడు ఏకంగా సినిమాలు శృంగారానికికేరాఫ్ గా మారుతున్నాయి. అందుకే యువత కూడా ఎగబడి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆడవాళ్లపై హత్యలు వంటివి కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. అయినా సినిమాల ధోరణి మాత్రం ఎక్కడ మారలేదు. అయితే రొమాంటిక్ సినిమాలను వెలుగులోకి తీసుకొచ్చిన హీరో అంటే టక్కున గుర్తొచ్చేది మాత్రం విజయ్ దేవరకొండ.. 

 


అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసిన హీరో విజయ్.. ఈ సినిమాలో శృతి మించిన రొమాన్స్ తో ఆకట్టుకున్నారు. ఆ సినిమా ఫాన్ ఇండియా సినిమాగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా వచ్చిన తర్వాత అందరు ఇదే పద్దతిని పాటించడం మొదలు పెట్టారు. ఇక విజయ్ కూడా ఈ సినిమా తర్వాత వచ్చిన అన్నీ సినిమాలలో రొమాన్స్ తో రెచ్చిపోతూ వచ్చారు. 

 


ఇటీవల విడుదల అయిన  డియర్ కామ్రేడ్ చిత్రం అనుకున్న హిట్ ను అందించలేకుండా పోయింది. దీంతో డీలా పడ్డ హీరో విజయ్ దేవరకొండ. కొంతకాలం గ్యాప్ తీసుకొని మరి మరో సినిమాలో నటించారు. ఆ సినిమానే ' వరల్డ్ ఫెమస్ లవర్ ' .. క్రాంతి మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో నలుగురు హీరోయిన్లు నటించారు. వారితో కూడా వదలకుండా రొమాన్స్ పండించాడు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు. 

 


ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువ చేసిన కూడా ఎక్కడ అది ఫలించక పోవడంతో ఇకమీద రొమాన్స్ చేయనని గట్టిగా నిర్ణయించుకున్నారట. ఇకమీద ఇటువంటి సినిమాలకు దూరంగా ఉంటానని ఆయన అన్నారు.ఏ రొమాన్స్ తో అయితే హీరోగా క్లిక్ అయ్యాడో అదే రొమాన్స్ ను ఆయన పక్కన పెట్టడం పై పలువురు విమర్శకులు చెవులు కోరుకుంటున్నారు. మరి  విజయ్ ఎటువంటి సినిమాలలో నటిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: