- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

కోలీవుడ్ హీరో విజయ్ నటించిన భారీ సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా పడటం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా వాయిదా పడటం వల్ల చాలామంది పంపిణీదారులు, నిర్మాతలు ఆందోళన చెందుతుంటే, తెలుగు అగ్ర‌ నిర్మాత డీవీవీ దాన‌య్య‌ మాత్రం ఈ గండం నుండి చాకచక్యంగా తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సదరు నిర్మాతసినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను భారీ ధరకు దక్కించుకోవాలని తొలుత భావించారు. అయితే చివరి నిమిషంలో ఎందుకో వెనక్కి తగ్గడంతో ఆయనకు భారీ నష్టం తప్పిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సినిమా మేకింగ్‌లో జరుగుతున్న ఆలస్యం అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల విడుదల తేదీ మారుతూ వస్తోంది. ఒకవేళ ఆయన అప్పుడే ఒప్పందం కుదుర్చుకుని ఉంటే, ఇప్పుడు వడ్డీల రూపంలోనే భారీ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చేది.


సినిమా ను నిర్మించేందుకు చాలా మంది నిర్మాత‌లు పోటీ ప‌డ్డారు. కానీ దాన‌య్య‌ తన అనుభవంతో సినిమా స్థితిగతులను ముందే ఊహించి, అడ్వాన్స్ చెల్లింపుల విషయంలో ఆచితూచి అడుగు వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాల విడుదల వాయిదా పడితే పంపిణీదారులు కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పెద్ద సీజన్లలో థియేటర్ల సర్దుబాటు కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఈ గందరగోళం నుండి దాన‌య్య‌ను సురక్షితంగా బయటపడటంతో ఆయన వ్యాపార చాతుర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఒక సినిమాను కొనడం కంటే, ఎప్పుడు కొనాలో లేదా ఎప్పుడు వదులుకోవాలో తెలియడం సినిమా వ్యాపారంలో ఎంతో ముఖ్యం.


మరోవైపు 'జన నాయగన్' సినిమా వాయిదా వల్ల విజ‌య్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని సందిగ్ధంలో పంపిణీదారులు కూడా నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై వందల కోట్ల వ్యాపారం జరగడంతో, చిన్న ఆలస్యం కూడా మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే డీవీవీ దాన‌య్య‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక గుణపాఠంగా మారింది. అయితే జ‌న నాయ‌కుడు ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. కానీ వ్యాపార కోణంలో చూస్తే మాత్రం ఇలాంటి వాయిదాలు పంపిణీదారుల నడ్డి విరుస్తాయి.


ఒకవేళ దాన‌య్య‌ ఈ ప్రాజెక్టులో ఉండి ఉంటే, ఇతర సినిమాలపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆయన తన దగ్గర ఉన్న నిధులను ఇతర సినిమా ల‌పై మళ్లించే అవకాశం దక్కింది. రజనీకాంత్ క్రేజ్ మీద నమ్మకంతో గుడ్డిగా వెళ్లకుండా, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం వల్ల దాన‌య్య తెలివిగా త‌ప్పించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: