పవన్ కళ్యాణ్ 26 వ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కు సంబంధించిన ట్యాగ్ వైరల్ అవుతూ వస్తున్నది.  ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది.  పవన్ ఎలా కనిపించబోతున్నారు అన్నది అందరిలోనూ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మరలా సినిమాల్లో నటించలేదు.  చాలా గ్యాప్ తరువాత రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యాడు.  


గతంలో పవన్ కళ్యాణ్ కు నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడం వలన అయన సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు.  సినిమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  ఇప్పటికే మూడు సినిమాలను పవన్ లైన్లో పెట్టారు.  అందులో మొదటి సినిమా పింక్ రీమేక్.  దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ కాబోతున్నది.  


ఈ లుక్ కోసం ఫ్యాన్స్ నిన్నటి నుంచి ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.  పవన్ ను తెరపై చూసుకోవాలి అనే వారి కోరిక ఈరోజు నెరవేరబోతున్నది.  ఫస్ట్ లుక్ ఏ విధంగా నిర్మాత రాజు ప్లాన్ చేశాడో తెలియడంలేదు కానీ, లుక్ మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.  స్పెషల్ గా ఉండటమే కాదు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఫస్ట్ లుక్ డిజైన్ చేస్తున్నారని సమాచారం.  


సినిమా కోసం పవన్ కళ్యాణ్ 30 రోజుల కాల్షీట్ ఇచ్చారు. మే నెలలో సినిమా రిలీజ్ అవుతుంది.  ఈ మూవీతో పాటుగా పవన్ మరో సినిమా కూడా ప్లాన్ చేసుకున్నారు.  క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది.  పీరియాడికల్ స్టోరీతో సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, పవన్ 26 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను మార్చి 8 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: