తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం దారుణమైన డిజాస్టర్ అయ్యింది.  వాస్తవానికి ఈ చిత్రం ఫస్టాఫ్ చాలా బాగున్నా సెకండాఫ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.  మొత్తానికి ఈ చిత్రం ఎఫెక్ట్ దర్శకుడు త్రివిక్రమ్ పై పడింది.  ఇదే సమయంలో ఏపిలో ఎన్నికలు రావడంతో పవన్ కళ్యాన్ రాజకీయాల వైపు మళ్లారు.  ఆయన స్థాపించిన ‘జనసేన’ పార్టీ తరుపు నుంచి అలుపెరుగని ప్రచారం చేశారు.  రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆయన దారుణమైన ఫలితాన్నొ పొందాడు.  రెండు చోట్ల ఓడిపాయారు.. ఆయన పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు.  ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే చిత్రాల్లో నటించేందుకు సిద్దమయ్యారు.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

 

ఎప్పటి నుంచో పవన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న పవన్ ఫస్ట్ లుక్ రానే వచ్చింది..అంతే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా ఈ ఫస్ట్ లుక్  ప్రభంజనం సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.  పీఎస్ పీకే 26, వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ లతో రిలీజైన ఈ ఫస్ట్ లుక్ కు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కిస్తున్నారు.   ‘వకీల్ సాబ్’గా పవన్ ఫస్ట్ లుక్.. విషయాన్ని తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. లగేజ్ ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో కుర్చీపై కాళ్లు ఆనించి ఉండటం ఫస్ట్ లుక్ లో కనబడుతుంది. 

 

తాజాగా ఈ లుక్ పై సెలబ్రెటీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  వకీల్ సాబ్' లుక్ పై దర్శకుడు మారుతి తనదైన శైలిలో స్పందించారు. 'ఇచ్చట పాత రికార్డులు సవరించబడును' అంటూ ట్వీట్ చేశారు. దేవిశ్రీప్రసాద్ తమన్, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి ట్విట్టర్ లో తమ హర్షం వ్యక్తం చేశారు. వచ్చేస్తున్నాడు పవర్ స్టార్ అంటూ ట్వీట్లతో సందడి చేశారు.  నివేదా థామస్, లావణ్య త్రిపాఠి తదితర హీరోయిన్లు కూడా 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పై స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: