లిప్ లాక్ సన్నివేశాలు అంటే బాలీవుడ్, బాలీవుడ్ అంటే లిప్ లాక్... ఈ విధంగానే ఉంటాయి అక్కడి సినిమాలు. లిప్ లాక్ ప్రపంచానికి పరిచయం చేసిన హాలీవుడ్ లో కూడా ఆ రేంజ్ లో లిప్ లాక్ సీన్స్ ఉండేవి కాదు. కానీ బాలీవుడ్ దర్శకులు మాత్రం ఈ విషయంలో చాలా ముందుకి వెళ్ళిపోయారు. దాదాపు అన్ని సినిమాల్లో ఈ సన్నివేశాలు ఉంటున్నాయి. వాటికి మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో దర్శక నిర్మాతలు వాటిని కమర్షియల్ గా భావిస్తూ లిప్ లాక్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు అనేది వాస్తవం. 

 

ఇక హీరోలు హీరోయిన్లు కూడా ఈ విషయంలో కాస్త దూకుడుగానే ఉంటున్నారు అని చెప్పాలి. తాజాగా బాలీవుడ్ లో వచ్చిన మలంగ్ సినిమాలో దిశా పటాని, ఆదిత్య రాయ్ కపూర్ లిప్ లాక్ సీన్ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది అని చెప్పాలి. అనీల్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు చేయకపోయినా  విడుదల చేసిన పోస్టర్ లోని లిప్ లాక్ సీన్ తో సినిమా బాగా పాపులర్ అయింది అనే చెప్పాలి. దీనికి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ వచ్చేసింది అనే చెప్పుకోవాలి. 

 

ఈ చిత్రంలో సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ చుంబన ఫోస్టర్ నెటింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ పోస్టర్‌ను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. పోస్టర్‌లో దిశ, ఆదిత్య భుజాలపై అతనికి ఘాటుగా కిస్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఇది రిలీజ్ చేసిన కాసేపటికే బాలీవుడ్ జనాలను అమితంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఆ సీన్ అర్జున్ రెడ్డిని మించిపోయింది అని కొందరు అంటే హీరో హీరోయిన్ సహకారం మాత్రం ఒక రేంజ్ లో ఉందని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: