అమెరికన్‌ మోడల్‌ క్రిస్సీ టీజెన్ ఇన్నేళ్ల తరువాత తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌ గురించి తొలిసారిగా పెదవి విప్పింది. దాదాపు 14 ఏళ్ల క్రింత తన కెరీర్‌ తొలి రోజుల్లో ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా తన బ్రెస్ట్‌ పరిమాణం పెంచుకుంది క్రిస్సీ. పేజ్‌ సిక్స్‌ అనే వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. `34 ఏళ్ల క్రిస్సీ టీజెన్‌ వీలైనంత త్వరగా తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌ను తొలగించుకుని బ్రెస్ట్‌ను బిగుతుగా చేసుకునేందుకు ఆలోచిస్తుందట.  దాదాపు సర్జరీ చేయించుకున్న 14 ఏళ్ల తరువాత క్రిస్సీ ఈ ఆలోచన చేస్తోంది.

 

ఈ సందర్భంగా క్రిస్సీ మాట్లాడుతూ `నేను నా బ్రెస్ట్ ఆపరేషన్‌ నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చేయించుకున్నాను. అప్పట్లో ఓ స్విమ్‌ సూట్‌ ఫోటో షూట్‌ కోసం నా అందాలు మరింతగా కనిపించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఆ షూట్‌లో నేను వెనక్కు పడుకొని ఫోజ్‌ ఇవ్వాల్సి ఉంది. అందుకోసమే ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా. ఆ తరువాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. దీంతో పిల్లలకు పాలివ్వటంతో బ్రెస్ట్ పరిమాణం మరింత పెరిగింది. ప్రస్తుతం నేను ఇంప్లాంట్స్‌ వల్ల ఇబ్బంది పడుతున్నా అందుకే తొలగించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నా` అంటూ క్లారిటీ ఇచ్చింది.

 

ఇటీవల క్రిస్సీ టీజెన్‌ తన కూతురితో కలిసి దిగిన ఓ ఫోటో వివాదాస్పదమైంది. తన ఎద భాగం ఎక్స్‌పోజ్‌ అయ్యేలా సూట్‌లో ఉన్న ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది క్రిస్సీ అయితే కూతురితో ఉన్న ఫోటోలో కూడా ఎక్స్‌పోజింగా అంటూ నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

on set with my stylist

A post shared by chrissy teigen (@chrissyteigen) on

మరింత సమాచారం తెలుసుకోండి: