తెలుగు సినీ పరిశ్రమలో జగపతి బాబు తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. హీరోగా, విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చేయని పాత్రలు అంటూ ఏమీ లేవు. హీరోగా ఆయన ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అయితే కెరీర్ మధ్యలో మాత్రం బాగా ఇబ్బంది పడి ఆ తర్వాత హీరో పాత్రలకు క్రమంగా దూరమయ్యారు. కాని సినిమాను ప్రేమించారు ఆయన. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఏ హీరోయిన్ పక్కన అయినా సరే జగపతి బాబు అలా సెట్ అయిపోయే వారని అంటూ ఉండే వారు. 

 

ఇక ఇప్పుడు ఆయన తండ్రిగా కూడా ఆకట్టుకుంటున్నారు. విలన్ గా మైమరిపిస్తున్నారు. తన లుక్ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆయన మెప్పిస్తూనే ఉన్నారు. అయితే జగపతి బాబు పక్కన ఒదిగినట్టు సరిపోయే హీరోయిన్స్ లో కల్యాణి ఒకరు. కబడ్డీ కబడ్డీ సినిమాలో ఈ పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. ప్రేక్షకులు కూడా వీరిని బాగానే ఆదరించారు అప్పట్లో. ఇక ఇది పక్కన పెడితే వీరిద్దరూ లెజెండ్ సినిమాలో భార్యా భర్తలుగా కనిపించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందులో కళ్యాణి పాత్ర పెద్దగా లేకపోయినా చాన్నాళ్ళ తర్వాత వారిని చూసిన ప్రేక్షకులు మంచి సెలెక్షన్ అంటూ బోయపాటి ని పొగిడారు. 

 

ఆ తర్వాత వీరు కలిసి నటించాలని కోరారు. పెదబాబు సినిమాలో వీరిని చూసి హీరో హీరోయిన్ అనుకోవడం కంటే కూడా... భార్యా భర్తలు అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈ కాంబినేషన్ కోసం ఇప్పటికి కూడా కొంత మంది ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక జగపతి బాబు... విలన్ గా ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇక ఇతర భాషల్లో కూడా ఆయనతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: