ఎవరి అభిప్రాయాలు వారివి. ఒకరి అభిప్రాయాలతో మరొకరు విభేదించవచ్చు. కానీ ఒకరి అభిప్రాయాన్ని మాత్రం హేళన చేసే హక్కు మరొకరికి లేదు. ఈ విషయంలోనే హీరోయిన్ తాప్సీకి, ఓ బాలీవుడ్ డైరెక్టర్ కు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోంది.

 

టాలీవుడ్ లో ఉన్నప్పుడు తాప్సీ కిమ్మనకుండా తన పని తాను చేసుకుపోయింది. కానీ బాలీవుడ్ కు వెళ్లాక ఈ బ్యూటీ ఆటిట్యూడ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయింది. ఎవరైనా ఏదన్నా అంటే బుల్లెట్ లా విరుచుకుపడుతోంది. రీసెంట్ గా తాప్సీ లీడ్ రోల్ ప్లే చేసిన బాలీవుడ్ మూవీ తప్పడ్ రిలీజైంది. ఈ చిత్రం కథకి సంబంధించి ఇప్పుడు తాప్సీకి, ఓ డైరెక్టర్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 

 

ప్రేమగా చూసుకునే భర్త నలుగురిలో చెంప దెబ్బ కొడితే.. హర్ట్ అయిన భార్య ఏకంగా విడాకుల వరకు వెళ్లే కాన్సెప్ట్ తో తప్పడ్ తెరకెక్కింది. ఈ కథపై దర్శకుడు అహ్మద్ ఖాన్ తన భాగీ 3 చిత్రం ప్రమోషన్ లో భాగంగా రియాక్ట్ అయ్యాడు. ఎంతో ప్రేమించే భర్త ఒక దెబ్బ కొడితే భార్య విడాకులకు వెళ్లడం ఏంటి.. అంటూ ప్రశ్నించాడు. నా భార్యను నేను ఒకటి కొడితే నన్ను ఆమె తిరిగి కొడుతుంది. దాంతో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పాడు. ఈ కామెంట్ తో తాప్సీ మండిపోయింది. 

 

దర్శకుడి విమర్శలపై తాప్సీ సున్నితంగా స్పందించింది. తప్పడ్ కాన్సెప్ట్ ను ఉద్దేశించి అహ్మద్ ఖాన్ చేసిన కామెంట్స్ కు తాప్సీ రీకౌంటర్ వేసింది. మాకు కరెక్ట్ గా అనిపించిందే సినిమాగా తీశాం. మీకు ఇష్టముంటే చూడండి లేదా మానేయండి. ఒక్కో దర్శకుడికి ఒక్కో ఆలోచన ఉంటుంది. విమర్శ చేయడం సరైంది కాదంటూ రీ కౌంటర్ చేసింది. ఒకరి అభిప్రాయాలు విభేదించిన పర్వాలేదు. కానీ  హేళన చేయడం సరైంది కాదంటూ తాప్సీ ఫైర్ అవుతోంది. బీటౌన్ కు వెళ్లాక తాప్సీ మహా ముదురు అనిపించుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: