సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు సీక్వెల్ అది. మొదటి సినిమా పార్ట్ ఏ అద్భుతం.. ఫీల్ మై లవ్ అనే కాన్సెప్ట్ అది. ఆ కాలంలో ఆ సినిమా చూసి ఎందరో ప్రేమికులు ఫీల్ మై లవ్ అంటూ తిరిగినవాళ్ళే.. ఇంకా మ్యూజిక్ కూడా సూపర్ దానిలో.. ఆ సినిమాలో నా ప్రేమను కోపంగాను.. నా ప్రేమను శాపంగాను.. చెలియా ఫీల్ మై లవ్ అంటూ వచ్చే లిరిక్స్ వింటే వావ్ అనిపిస్తుంది. 

 

ఇంకా అలాంటి సినిమాలో ప్రేమించినవారు బాగుండాలి అని ప్రేమను కూడా త్యాగం చేసే గొప్ప మనసు అది. ఆ సినిమా పేరు ఇప్పటికే మీకు తెలిసిపోయింటుంది.. అదే ''ఆర్య'' సినిమా. ఆ సినిమాలో అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం అంటూ వచ్చే పాటలో వేసే స్టెప్పులు సూపర్.. ఇంకా ఈ సినిమాలు దేవి శ్రీ ప్రసాద్ ఏ సంగీతాన్ని అందించారు. 

 

ఆ సినిమాలో ఎలా అయితే ఐటెం సాంగ్ హిట్టో.. ఆర్య సినిమా సీక్వెల్ ఆర్య 2 లో రింగ రింగ ఐటెం సాంగ్ అంతే హిట్టు. ఈ సినిమాకు అదే హీరో.. అదే దర్శకుడు.. అదే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా అలాంటి ఈ సినిమాకు స్టోరీ లైన్ కూడా ఇంచుమించు అదే. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. ఆర్య గీతను ప్రేమిస్తాడు.. గీత అజయ్ ని ప్రేమిస్తుంది. 

 

ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి.. అందులో ఇంకా బాగుండే సాంగ్ ఏది అంటే అది రింగ రింగ... ఆ సినిమాలో ఆ సాంగ్ హైలెట్. ఆ లిరిక్స్ కూడా సూపర్ ఏ.. ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి. అంటూ వచ్చిన లిరిక్ కి ఈలలే ఈలలు.. ఈ సాంగ్ కూడా ఇప్పటికి సూపర్ హిట్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: