చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది నటులు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంది ప్రముఖ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి... రాజకీయాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. తెలుగునాట అలా సినిమా రంగంలో తిరుగులేదు అని నిరూపించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ సత్తా చాటి చరిత్ర సృష్టించిన నటుడు నందమూరి తారక  రామారావు. సినిమాల్లో  అసలు ఎన్టీ రామారావుకు తిరుగులేదు అని కొత్త చరిత్రను సృష్టించారు. ఆ తర్వాత ప్రజా సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు ఎన్టీ రామారావు. 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీరామారావు రేంజ్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో  అంచలంచలుగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ గా  మారిపోయారు. అలాంటి చిరంజీవి ఒక సమయంలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజా రాజ్యం అనే పార్టీని స్థాపించి... ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే లోకి అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎన్టీరామారావు లాగానే రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేస్తారు అని అందరూ అనుకున్నారు. 

 

 

 కానీ రాజకీయాలలో మాత్రం అంతగా ప్రభావితం చేయలేకపోయారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయారు. ఇక ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే ఇలా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే చిరంజీవి చేసిన తప్పు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారి తక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత అలాగే కొనసాగితే మరో సారి పోటీ చేసివుంటే ప్రజల్లో చిరంజీవి పైన నమ్మకం వచ్చేదని... కానీ చిరంజీవి ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో చిరంజీవి పై ప్రజలకు ఉన్న నమ్మకం పోయిందని అందుకే... అప్పట్లో ఎన్టీఆర్ రాణించినట్లుగా  చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోయారు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: