శ్రీ హరి ... గొప్ప నటుడు అనే కంటే గొప్ప వ్యక్తిత్వం దానగుణం ఉన్న వ్యక్తి అంటే చాలా బావుంటుంది. అడిగినవాళ్ళకి లేదనకుండా, కాదనకుండా సహాయం చేసే మంచి మనిషి.  శ్రీహరి ఏడవ తరగతి వరకే చదువుకున్నారు. తర్వాత చదుకోవాలన్న ఆసక్తి లేకపోవడంతో ఉన్న అర ఎకరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యారు. అయితే హైదరాబాద్ వచ్చాకా మళ్ళీ వాళ్ళూ వీళ్ళు చెప్పడంతో ఉదయం చదువుకుంటూ, సాయంత్రం షెడ్డులో మెకానిక్ గా పనిచేవాడు. హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్నో శారీరక ధారుడ్య పోటిల్లో పాల్గొని 'మిస్టర్ హైదరాబాద్' గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయం తరపున రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. 

 

ఇక 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు 'ధర్మక్షేత్రం' సినిమా ద్వార సినీరంగ ప్రవేశం చేసిన శ్రీ హరి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సస్ అయ్యారు. ఇది నిజంగా ఎవరూ ఊహించనిది. పోలీస్ సినిమాతో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. రియల్ స్టార్‌గా ఫేమస్ అయిన శ్రీ హరి హీరోగా 25 సినిమాలకి పైగా నటుడిగా దాదాపు వంద సినిమాల్లో నటించారు. ముఖ్యంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. శ్రీ హరి సెకండ్ ఇన్నింగ్ ఎంతో అద్భుతంగా సాగింది.

 

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న కాలేయ సంబంధ వ్యాధి వలన ముంబై లో కన్నుమూసారు. అయితే ఇందుకు కారణం శ్రీహరి ఎక్కువగా గుట్కా ప్యాకెట్స్ తినేవారు. రోజుకి లెక్కకి మించి గుట్కా ప్యాకెట్స్ తినడం అలవాటు. ఎంతగా అంటే ఒకేసారి 3-4 ప్యాకెట్స్ నోట్లో వేసుకున్నారంటే అది బయటికి ఉమ్మివేసేవారు కాదట. ముఖ్యంగా ఈ ప్యాకెట్స్ తన దగ్గరికి వచ్చే స్నేహితులే తరచుగా తెచ్చి ఇచ్చేవాళ్ళట. దానికి తోడు ఇతర అలవాట్లు ఉండటంతో లివర్ బాగా దెబ్బతినింది. ఇదే ఆయన ప్రాణాలు తీసింది. లేకపోతే శ్రీ హరి ఇప్పట్లో చనిపోయో వ్యక్తికాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: