తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ మద్య నివాస్ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.  ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసకున్నారు అల్లు అర్జున్. అయితే సరైన కథ కోసం ఈ గ్యాప్ తీసుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన ‘అల వైకుంటపురములో’ సూపర్ హిట్ అయ్యింది.  రెండేళ్ల నిరీక్షణకు అల్లు అర్జున్ మంచి విజయాన్ని అందుకున్నాడు.  ఇదే జోష్ తో ఇప్పుడు ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సుకుమార్ తో ఓ చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్.  

 

శేశాచలం అడవుల్లో గందం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట.  ఇందులో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ తో కనిపించబోతున్నారట.  గతంలో ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదట. అయితే ఈ పాత్ర పర్ఫెక్షన్ కోసం నిజంగానే అల్లు అర్జున్ లారీ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నారట.  దాంతో ఈ చిత్రంలో లో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించేది నిజమేనని తెలుస్తోంది. బీడీ తాగుతూ.. లుంగీ పైకి కట్టి .. పూర్తి మాస్ లుక్ తో చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఉంటాడట.

 

ఆ మద్య రామ్ చరణ్ తో రంగస్థలం లో ఈ తరహా పాత్రనే చూపించాడు సుకుమార్. అయితే అందులో చెర్రీ చెవిటి  పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.   రష్మిక కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అంతే కాదు ఈ చిత్రంలో  విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: