మామూలుగా సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే అభిమానులు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల వివాహం ఎక్కడ జరుగుతుంది... ఎలా జరుగుతుంది... ముఖ్య అతిథులుగా ఎవరెవరు హాజరవుతున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మరి ఈ వారం టాలీవుడ్ లో పెళ్లి కబురు ఏమిటి అంటే. నటి షీలా  పెళ్లి. తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి షీలా  పెళ్లి చేసుకుంది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి తో నటి శీలా పెళ్లి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. 

 

 

తన భర్త తో దిగిన ఫోటో ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది షీలా . ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకం... చాలా ఆనందంగా ఉంది.. మా నూతన జీవితానికి ఇది ఓ కొత్త రోజు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే శిలా చాలామంది తెలుగు ప్రేక్షకులకు కొసమెరుపు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో కొన్ని రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిచింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించినది  ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా స్టైలిష్ స్టార్  అల్లుఅర్జున్ సరసన పరుగు సినిమాలో నటించి పల్లెటూరి అమ్మాయి గా తనదైన అందం తో అలరించింది  ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత పరమవీరచక్ర సినిమాలో కూడా నటించింది. 

 

 

 ఇక ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ సినిమాలో కూడా నటించింది... మంచు మనోజ్ తో రాజు భాయ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మస్కా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ... ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమై పోయింది. ప్రస్తుతం తన పెళ్లి తో తెలుగు ప్రేక్షకులను మరో సారి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక షీలా  పెళ్లి అవ్వడం ఏమో కానీ... షీలా కూడా పెళ్లి చేసుకుంది నీ పెళ్ళెప్పుడు అనుష్క అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూనే వున్నారు. అయితే అనుష్క పెళ్లి గురించి ఇప్పటి నుంచి కాదు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు అవుతున్న తరుణంలో అనుష్క నీ  పెళ్లెప్పుడు అనే ప్రశ్న టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి నోట వినబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: