తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి ఉన్న ప్రాధాన్యం చాలా తక్కువ. అదే స్టార్ సినిమాలో అంటే మరీ తక్కువగా ఉంటుంది. కథ మొత్తం హీరో చుట్టూ నడుస్తుంది కాబట్టి హీరోయిన్లు కేవలం ఆ కథలో ఒకానొక పాత్రగానే ఉంటారు తప్ప ఎక్కడా హీరోకి సమానంగా కనిపించరు. ఇది కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు ప్రతీ చోటా ఉన్నదే. హాలీవుడ్ లెక్కలు వేరు కాబట్టి దాన్ని వదిలేసి మనదేశం మటుకు పరిస్థితి ఇలాగే ఉంది. అయితే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడట్లేదని కాదు వాటికి మార్కెట్ ఉంటుంది. 

 

 

కానీ చాలా తక్కువ శాతం మాత్రమే. ఏ అనుష్కనో  అయితే తప్ప హీరోయిన్ గా అలాంటి స్టేటస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఇక స్టార్ హీరోయిన్లు అని చెప్పుకునే వాళ్ళందరూ స్టార్ హీరో సినిమాల్లో నటించిన వారే అయి ఉంటారు. స్టార్ హీరోతో అవకాశం వచ్చిన వారినే స్టార్ హీరోయిన్ గా ఒప్పుకుంటారు ఇక్కడ. అయితే మన దగ్గర ఉన్న ఇంకో విషయం ఏంటంటే తెల్లాగా ఉన్నవాళ్ళనే హీరోయిన్లని చేస్తారు. కొంచెం నల్లగా ఉన్నారంటే వారు హీరోయిన్ గా పనికిరారని చెప్పేస్తారు.

 

 

ఈ రంగు సమస్య ఎదుర్కొన్న వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. ఐశ్వర్య రాజేష్ తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే అక్కడ కూడా ఆమె ఇదే సమస్యని ఎదుర్కొందట. ఆ సమస్యని అధిగమించి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కౌసల్య క్రిష్ణమూర్తి అనే స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా ద్వారా తెలుగు తెర మీద కనిపించింది.

 

 

అయితే ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో దేవరకొండ విజయ్ సరసన నటించి మంచి మార్కులు  కొట్టేసింది. అయితే సినిమాలో ఆమె నటన బాగున్నప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదట. డస్కీ స్కిన్ క;ఇగి ఉందనో లేక డీ గ్లామరైజ్డ్ పాత్రలకే సూటవుందన్న అపనమ్మకంలో ఆమెని పక్కకి పెట్టేస్తున్నారట. మరి హీరోయిన్లంటే తెల్లగానే ఉండాలనే నమ్మకం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: