అందరికి విలన్ గా తెలిసిన షాయాజీ షిండే కధ కాస్త విచిత్రం. అనేక సినిమాలలో నటించి ఈ నటుడు అందర్నీ ఆకట్టుకున్నాడు. కేవలం తెలుగులోనే కాక మరాఠీ, తమిళ, గుజరాతి, కన్నడ, హిందీ, ఇలా అనేక భాషల్లో నటించాడు. షాయాజీ షిండే రైతు కుటుంబం నుండి వచ్చాడు. తాను చదువుకుంటూ వాచ్ మెన్ కింద పని చేసేవాడట. తనకి 165 రూపాయిల జీతం మాత్రమే లభించేది. అయితే తనకి సినిమాలపై ఆసక్తి కావడంతో ముంబై వెళ్ళి ఎంతో కష్ట పడ్డాడు షిండే.

 

Image result for షాయాజీ షిండే

 

1978 వ సంవత్సరంలో సినిమా కెరీర్ ని ప్రారంభం చేసాడు. ఆ తర్వాత మరాఠీ సినిమాతో పాపులర్ అయ్యాడు ఈ విలన్. ఇలా ఒకటి తర్వాత ఒకటి సినిమాతో నటిస్తూ అంచల అంచలగా ఎదుగుతున్నాడు. ఠాగూర్, వీడే, ఆంధ్రావాలా, గుడుంబా శంకర్, అతడు, సూపర్, ఆంధ్రుడు, దేవదాసు, లక్ష్మి, బంపర్ ఆఫర్, డాన్ శీను ఇలా ఎన్నో తెలుగు సినిమాలలో నటించాడు షయాజీ షిండే. విలన్ గా షిండే సుస్థిర స్థానం సంపాదించాడు. ఎనలేని ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు. 

Image result for షాయాజీ షిండే

 

కేవలం నటుడుగా కాకుండా నిర్మాతగా కూడా షిండే  పలు సినిమాలు తీసాడు. మరాఠీ సినిమాలకి ప్రొడ్యూసర్ గా పని చేసి సినిమాలు అందించాడు.ఇలా షిండే నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అరుంధతి సినిమాలో షియాజీ షిండే భారీ డైలాగ్స్ తో ఫేమస్ అయ్యాడు. అలానే కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు ఈ విలన్. చక్కటి నటనతో మంచిగా పాత్రలని చేసి తనదైన శైలితో ఇట్టే ఆకర్షిస్తాడు ఈ విలన్. ఇలా పలు పత్రాలు చెప్పుకోదగ్గవి. షియాజీ మంచి విలన్ గా ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నాడు. విలన్ గా ఎన్నో పాత్రలు చేసి తార స్థాయికి చేరాడు షాయాజీ షిండే.

మరింత సమాచారం తెలుసుకోండి: