తెలుగు హీరో విజయ్ దేవరకొండకు వరుస హిట్లు క్రేజ్ తీసుకొస్తే ఒక్క అర్జున్ రెడ్డి స్టార్ హీరోని చేసేసింది. తెలుగులోనే కాదు ఏకంగా సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ హీరోగా మారిపోయాడు. ఇక బాలీవుడ్ లో అయితే.. హిందీలో ఒక్క సినిమా చేయకపోయినా అక్కడా హాట్ టాపిక్ అయిపోయాడు. హిందీలో కబీర్ సింగ్ ను ఓ హీరో చేస్తే మనోడు ఫేమస్ అయిపోయాడు. పెళ్లిచూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి లాంటి వరుస హిట్లు విజయ్ ను స్టార్ ను చేసేశాయి. ఇటివల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ రిలేషన్ గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు.

 

 

లవ్ ఇన్ రిలేషన్ గురించి మీ అభిప్రాయమేంటి అని అడిగిన ప్రశ్నకు.. ‘నా లవ్ ఇన్ రిలేషన్ గురించి నో కామెంట్స్. ఒకవేళ నేను రిలేషన్ లో ఉంటే దానిని గోప్యంగానే ఉంచుతాను. ఆ విషయం ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. నా తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్తాను. ఏదొక రోజు అందరికీ చెప్తాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అందరికీ ఎంటర్ టైన్మెంట్ అవ్వాలని నేను కోరుకోవడం లేదు’ అని కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. చాలా మందిలా లవ్ మ్యాటర్ ను పబ్లిక్ గా ప్రెజెంట్ చేయాలని భావించటం లేదని అతని మాటల ద్వారా తెలుస్తోంది.

 

 

రీసెంట్ గా ‘మోస్ట్ డైజైరబుల్ మెన్’ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ గా ఫైటర్, లైగర్ అనే పేర్లు రౌండ్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. బాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాత కరణ్ జోహార్సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: