తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్.  రాంగోపాల్ వర్మ శిష్యుడుగా ఇండస్ట్రీకి పరిచయం పూరి జగన్నాథ్ మొదటి చిత్రం పవన్ కళ్యాన్ తో తీశారు.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బద్రి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మాస్ మహరాజతో ఇడియట్ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు - పూరి కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది.  ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ తర్వాత పూరి వరుసగా డిజాస్టర్స్ పొందుతున్నాడు.  ఈ నేపథ్యంలో గత ఏడాది రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ తో బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ చిత్రంతో రాబోతున్నాడు.  

 

ఈ చిత్రంలో క్రేజీస్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నేటి ఆదివారం ప్రజలందరినీ ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ నేపథ్యంలో సినీ సెలబ్రెటీలు మోదీకి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో జనతా కర్వ్యూ నేపథ్యంలో  గంటలు ఇంట్లో ఉండడం తమ వల్ల కాదని వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆముదం తాగాలని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సలహా ఇచ్చాడు.

 

ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అందరం ప్రధాని మాట విందామని ఆ వీడియోలో పేర్కొన్న పూరి.. అలా చేస్తే కరోనా వైరస్ చైన్ కట్ అవుతుందన్నాడు. కాబట్టి పెద్దల మాటను గౌరవించి ఇంట్లోనే ఉందామన్నాడు.  ఇంట్లో ఎక్కువ సమయం గడపలేక.. ప్రెస్టేషన్ కి గురయ్యేవారు... అలాంటి వారు నేటి ఉదయం నాలుగు స్పూన్ల ఆముదం తాగాలని సూచించాడు. అలా చేస్తే విరేచనాలు పట్టుకుని బయటకు రాలేరని వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: