మెగా పవర్ స్టార్ రాంచరణ్ టాలీవుడ్ ప్రేక్షకులకి ఊపు తెప్పించే హీరో. మొదట ప్రేక్షకులు అంతలా మెచ్చుకోకపోయినా...  ఇప్ప్పుడు తనకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాలలో చక్కగా నటిస్తున్నాడు ఈ హీరో. అలానే మెగా పవర్ స్టార్ డాన్స్ కూడా చెప్పుకోదగ్గది . తెరపై ఈ హీరో కనిపించాడు అంటే రచ్చ రచ్చే .

 

IHG

 

 

ఈ బ్రూస్ లీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రాబోతున్నాడు. దర్శకుడు రాజమౌళి ఆధ్వర్యంలో ఈ సినిమా రానున్నది. మల్టీ స్టారర్ సినిమా కావడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి వస్తున్నాడు చరణ్ . మొదట రామ్ చరణ్ 2007 వ సంవత్సరంలో చిరుతతో ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మగధీర సినిమాలో నటించాడు. కాల భైరవగా చెర్రీ ఎందరో ప్రశంసలు పొందాడు.

 

 

ఆ తర్వాత ఆరెంజ్, రచ్చ, నాయక్ , తుఫాన్ , ఎవడు , గోవిందుడు అందరివాడే , బ్రూస్ లీ , ధ్రువ, రంగస్థలం , వినయ విధేయ రామ ఇలా అనేక సినిమాలలో నటించిన చరణ్ పాత్ర చెప్పుకో దగ్గది. కేవలం హీరోగా కాకుండా మెగా పవర్ స్టార్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు .

 

 

IHG

 

 

వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించాడు. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమాకి కూడా రామ్ చరణే నిర్మాత. 

మరింత సమాచారం తెలుసుకోండి: