దేశం మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ తో నిశ్శబ్ధ వాతావరణం అయ్యింది.  కరోనా సృష్టిస్తున్న అలజడికి ప్రపంచం మొత్తం కంటిమీద కునకు లేకుండా పోతుంది.  దేశంలో కరోనాని కట్టడి చేసే నిమిత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌ డౌన్‌లో ఉండి వారం అవుతోంది. ఈ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. రోజూ తింటున్న ఆహారం విలువ తెలిసింది. తినడానికి కావాల్సినంత ఉండటం అదృష్టం అనే విషయం అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ప్రజలు  నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండిలేనివాళ్లు ఆహారం కోసం బయటికి వెళ్లే సాహసం చేస్తుండటం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది.

 

 

ఇలాంటివాళ్ల గురించి ఇన్ని రోజులూ ఆలోచించకుండా నేనెంత స్వార్థంతో, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించానో తెలుసుకున్నాను. అలాంటి అభాగ్యులను గురించి ఆలోచించకపోవడం నా బాధ్యతా రాహిత్యం అనిపించింది. నా కోసం మా నాన్న ఎంతగా ఎదురుచూసేవారో తెలిసింది. మా కుటుంబంపై ఎంతమంది ఆధారపడ్డారో అర్థమైంది.  మా ఇంటికి నేను చాలా అవసరం అనే సంగతి గ్రహించాను. వాళ్లందరినీ బాధ్యతగా చూసుకోవాలని తెలుసుకున్నాను. వాళ్ల ఆరోగ్యమే నా ఆరోగ్యం అని తెలుసుకున్నాను.  అవును ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది.. కానీ అందరూ తమ బాధ్యతగా సహకరించాలి... ఆరోగ్యంగా ఉంటేనే మనం ముందు ముందు ఏదైనా సాధించగలం.

 

 

కరోనా వైరస్ వల్ల కేవలం మనుషుల ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తుందని అంటున్నారు.  కోట్ల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.. ప్రతి మనిషి అభద్రతకు లోనుఅవుతున్నారు.  ఇలాంటి కఠినమైన పరిస్థితి ఎప్పటికీ ఎవ్వరికీ రావొద్దని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అంటుంది అందాల నటి జాన్వీ కపూర్.  ఇక దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు అధికం అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 2,902 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: