జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగులో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాబు ని తెర మీద చూస్తే చాలు ప్రేక్షకులకు ఒక రకంగా పండగే. అందుకే అతని సినిమాలకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. జూనియర్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడతారు. జూనియర్ సినిమా విడుదల అవుతుంది అంటే వేరే హీరోలు తమ సినిమాలను కూడా వాయిదా అవేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. 

 

రాజకీయ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ ని దాదాపుగా ఖరారు చేసారు. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని ఈ సినిమాకు ఖరారు చేసింది చిత్ర యూనిట్. దాదాపుగా దీన్నే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో గాని ఈ టైటిల్ విషయంలో కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నాడు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అరవింద సమేత సినిమా సమయంలోనే ఓకే చేసినా అప్పుడు కొన్ని కారణాలతో వాయిదా వేసారు. 

 

ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. బాబు ని తన సినిమాలో కావాలి అని రణవీర్ సింగ్ అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. అతను చేసే ఒక లవ్ స్టోరీ లో ఎన్టీఆర్ ని యాక్షన్ హీరోగా తీసుకోవాలని నిర్మాతలకు ప్రతిపాదన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సినిమాలో ఎన్టీఆర్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ లో ఇప్పుడు టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: