నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీకళ్యాణం సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికీ ఓ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమాలోని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే పాటలో కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి తో చేసిన రొమాన్స్ ఓ పెద్ద సంచలనమే సృష్టించింది.


కుర్ర హీరోల సరసన ఈమెకు సినీ అవకాశాలు రాకపోవడం ఓ బాధాకరమైన విషయమే అయినప్పటికీ... కాజల్ మాత్రం తన అందచందాలను తెలివిగా ఉపయోగించుకుంటూ కోట్ల రూపాయల సంపదని తన బ్యాంకు ఖాతాలో వేసుకుంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటో షూట్ కి సంబంధించిన చిత్రాలను చూస్తే ఎవరికైనా ఆమె ఎంత సంపాదిస్తుందో ఇట్టే తెలుస్తుంది.


ఎలాగూ సినిమాల్లో ఇంతకు ముందులాగా అవకాశాలు రావట్లేదు కాబట్టి స్కిన్ షో బాగా చేస్తూ ఒంటిలో వేడి పుట్టించే హాట్-హాట్ ఫోటో షూట్లలో పాల్గొని డబ్బు సంపాదించుకుంటోంది. ఒకటి రెండు సినిమాలలో ప్రస్తుతం ఆమె నటిస్తున్నా... వీలు చిక్కినప్పుడల్లా ఫోటో షూట్లలో హాజరవుతోంది. అలాగే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న వెబ్ సిరీస్ ల వైపు కూడా ఈమె చిన్న చిన్న గా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఒకవైపు వారంలో రెండు మూడు ఫోటో షూట్స్ లో పాల్గొని డబ్బులు సంపాదిస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తుంది కాజల్ అగర్వాల్.


బాగా పాపులారిటీ ఉన్న రోజుల్లో ఈమె నెలలో ఐదారు షాప్ ఓపెనింగ్ కార్యక్రమాలకు వెళ్లి కోట్ల రూపాయలు సంపాదించిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ఆర్య, ఆర్య2, మగధీర లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో చాలా చక్కగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే కాజల్ అగర్వాల్ కెరీర్, వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోవాలని లక్షల మంది అభిమానులు ఎప్పుడు కోరుకుంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: