నిన్నటిరోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించడమే కాకుండా మరొకొన్ని నెలలు అన్ని త్యాగాలకు సిద్ధపడమని జాతికి పిలుపు ఇవ్వడంతో ఇండియాలో కరోనా కష్టాలు కనీసం మరొక రెండు నెలలు కొనసాగడం ఖాయం అన్న సంకేతాలు వచ్చేసాయి. దీనితో సినిమా షూటింగ్ లు సినిమా ధియేటర్లు మళ్ళీ ప్రారంభం కావడానికి జూన్ నెల వచ్చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

 

దీనితో  ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉన్నా నిర్మాణంలో ఉంటూ సగంలో ఆగిపోయిన భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి పూర్తి అయోమయంలో పడిపోయింది. ఈ లిస్టులో ఇప్పుడు అగ్ర స్థానంలో భారీ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ ఉండటంతో ఈ మూవీని అనుకున్న విధంగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడం కష్టం అన్న నిర్ణయానికి రాజమౌళి రావడమే కాకుండా తన మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి వచ్చే ఏడాది సమ్మర్ వరకు తనకు అన్ని విధాల అందుబాటులో ఉండమని రాజమౌళి చరణ్ జూనియర్ లకు ఇప్పటికే సూచన ప్రాయంగా తెలియచేసాడు అని అంటున్నారు. 

 

ఇలాంటి పరిస్థితులలో తిరిగి షూటింగ్ లు ప్రారంభం అయినా ‘ఆచార్య’ ను కొనసాగించాలి అంటే చరణ్ లేకుండా కుదిరే పరిస్థితి లేదు. చరణ్ స్థానంలో మహేష్ లాంటి మరొక టాప్ హీరోను పెట్టి ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలని అనుకున్నా కరోనా ఎఫెక్ట్ వల్ల ఇదివరకు లా టాప్ హీరోల భారీ సినిమాలకు బయ్యర్ల నుండి భారీ ఆఫర్లు వచ్చే ఆస్కారం లేదు. 

 

ఇలాంటి పరిస్థితులలో జూన్ లో షూటింగ్ లు మొదలైనా ‘ఆచార్య’ ను ఎలా పూర్తి చేయాలి అన్న టోటల్ కన్ఫ్యూజన్ చిరంజీవి కొరటాల లకు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూర్తిగా తయారుకాబడ్డ ఈ మూవీలో చిరంజీవితో ఇంచుముంచు సరిసమానమైన ఆ రెండవ హీరో పాత్రలో చరణ్ నటించలేకపోతే ఎప్పటికి ‘ఆచార్య’ పూర్తి అవుతుంది అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి కొరటాల చిరంజీవిల వద్ద కూడా సమాధానం లేని ప్రశ్నలు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: