సినీ ప్రపంచంలోకి అడుగు పెడితే జీవితం ధన్యం రా బాబూ అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు.  అలాంటిది సినీ జగత్తులో తనకంటూ మంచి క్రేజ్ వచ్చిన సమయంలో రిటైర్  మెంట్ ప్రస్తావన తీసుకు వస్తే కాస్త విడ్డూరంగానే ఉంటుంది.  చేసినవి నాలుగు సినిమాలు అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ హోదాని సంపాదించుకున్నారు దర్శకుడు కొరటాల శివ.. భద్ర, మున్నా,బృందావనం, సింహా వంటి సినిమాలకి మాటల రచయితగా పనిచేసిన కొరటాల మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్స్ అందుకున్నాడు. కమర్షియల్ హంగులతో పాటు ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూ సినిమాని హిట్ మెట్టు ఎక్కిస్తారు కొరటాల.

 

 అతి తక్కువ సమయంలోనే మెగాస్టార్ నే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు కొరటాల. టాలీవుడ్ లో దర్శకదీరుడు రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని మరో దర్శకుడిగా పేరు పొందారు. మంచి ఫామ్ లో ఉన్న కొరటాల తాజాగా తన రిటైర్మెంట్ పై సంచలన వాఖ్యలు చేశారు కొరటాల.. మరో ఐదేళ్లలో తాను రిటైర్ అవుతున్నట్టు స్వయంగా ప్రకటించారు.ఇప్పటివరకు తన దగ్గర ఉన్న స్క్రిప్టులతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నానని, ఇవి తీయడానికి మరో ఐదేళ్ళు పడుతుందని, ఆ తరవాత తాను దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకుంటానని కొరటాల వాఖ్యానించారు.

 

 సినీ రంగంలోకి ఎంతో మంది యువ దర్శకులు తమ సత్తా నిరూపించుకునేందుకు ముందుకు వస్తున్నారు.. వారందరికీ తన వంతు సహాయం అందిస్తానని అంటున్నారు. కొత్త దర్శకులను పరిచయం చేస్తూ తాను నిర్మాతగా మారనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం 40 శాతం కంప్లీట్ అయిన కరోనా వల్ల వాయిదా పడింది.. ఇది స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: