తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఎవరికీ సాధ్యం కానీ కామెడీ టైమింగ్ తో... ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. తనదైన డైలాగ్ డెలివరీతో ఎన్నో అవకాశాలను చేజిక్కించుకున్నాడు. ముఖ్యంగా హాస్యనటుడి శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా  ఉంటుంది. ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ లో కనిపించే శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఎంతో మంది ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాడు శ్రీనివాస్ రెడ్డి. కేవలం హాస్య నటుడిగానే కాకుండా... పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. 

 

 

 ఓ వైపు హాస్యనటుడిగా తనదైన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల అందరిని కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు... మంచి కథా నేపథ్యం ఉన్న కథలతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి  అలరిస్తున్నాడు. ఇప్పుడు వరకు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న  శ్రీనివాసరెడ్డి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు అనే చెప్పాలి. గీతాంజలి అనే సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్రెడ్డి మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పల్లెటూరు నేపథ్యంలో సాగే మరో సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన శ్రీనివాస్ రెడ్డి తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. 

 

 

 గతంలో శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా దర్శకుడిగా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ స్క్రిప్టును నేనే ఎంతో ఇష్టపడి రాసుకున్నాను.. అందువల్ల ఈ సినిమాను నేనే నిర్మించి దర్శకత్వం వహించాలని అనుకున్నాను అంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా తాను ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు అంటూ తెలిపాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో నిర్మాతగా తాను చాలా  డబ్బులు పోగొట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చిన శ్రీనివాసరెడ్డి... ఇండస్ట్రీ వైపు నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాను అంటూ  తెలిపారు. కానీ కొంతమంది మాత్రం అనుభవం ఉన్న దర్శకుడిగా తీసావ్ అంటూ ప్రశంసించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కానీ ఆ తర్వాత కామెడీయన్  అవకాశాలు తగ్గాయని... అయితే  కమెడియన్గా తాను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అంటూ చెప్పుకొచ్చారు శ్రీనివాస్ రెడ్డి

మరింత సమాచారం తెలుసుకోండి: