దేశంలో కరోనా ఎప్పటి నుంచి మొదలైందో.. ప్రజల్లో ఒక రకం భయం మొదలైంది. గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే థియేటర్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, బార్లు, క్లబ్స్ అన్నీ మూశారు.  లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సినీ పరిశ్రమ మొత్తం బంద్ అయ్యింది.  దాంతో సినీ సెలబ్రెటీలు ఇంటిపట్టున ఉంటున్నారు. ఒక్కొక్కరు తాము ఇంట్లో ఏం చేస్తున్నామో వీడియో షూట్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు ఇక ఫిట్ నెస్ విష‌యంలో బాలీవుడ్ భామ దిశా ప‌టాని ఎంత శ్ర‌ద్ద తీసుకుంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదే.. ఈ అమ్మడు మార్షల్ ఆర్ట్స్ లో రక రకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.  

 

త‌న రోజూవారి టైం టేబుల్‌లో జిమ్ సెష‌న్ కు స్పెష‌ల్ గా టైం కేటాయిస్తుంది. ఫిట్ గా ఉండాలంటే ఎలాంటి వ‌ర్క‌వుట్స్ చేయాలో చెబుతూ..అప్ప‌డపుడు కొన్ని వీడియోల‌ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తుంది. ఎప్పటికప్పుడు  వాల్ బ్యాక్ ప్లిప్‌, వెయిట్ లిఫ్టింగ్, కిక్ బాక్సింగ్‌, బ‌ట్ట‌ర్ ఫ్లై బ్యాక్ కిక్ తోపాటు త‌న ఫిట్ నెస్ ట్రైన‌ర్ తో క‌లిసి వ‌ర్క‌వుట్స్ చేస్తూ ఎలా ఫిట్ గా ఉండాలో చెబుతోంది.  

 

మరి ఈ అమ్మడు సాహస విన్యాసాలు ప్రాక్టీస్ చేయాలంటే కాస్త రిస్క్ తో కూడుకున్న విషయం అంటున్నారు మిగత సినీ నటులు. మరికొంత మంది  దిశా ప‌టానీ వీడియోల ద్వారా చెప్పే కొన్ని టిప్స్ ను ఫాలో అయితే..ఫిట్ గా త‌యార‌వ‌డం ఖాయ‌మంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆ తర్వాత తన హాట్ ఫోటో షూట్స్ తో బాగా పాపులర్ అయ్యింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Missing the action💀

A post shared by disha patani (paatni) (@dishapatani) on

మరింత సమాచారం తెలుసుకోండి: