లాక్డౌన్ కారణంగా రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అన్నీ రెడీ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న వారికి కరోనా రూపంలో పెద్ద షాక్ తగిలింది. కరోన రక్కసి అందరి జీవితాలని బాగా డిస్టర్బ్ చేసింది. ఈ మహమ్మారి ఎప్పుడు వదులుతుందో తెలియక అయోమయంలో పడిపోయారు సినీ పరిశ్రమ పెద్దలు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా థియేటర్లు తెరుచుకుంటాయన్న నమ్మకం లేదు.

 

సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో అనేక ఆంక్షలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి జనాలు గుమిగూడేందుకు అనుమతులు అంత తొందరగా లభించకపోవచ్చు. కాబట్టి థియేటర్లు తెరుచుకునేందుకు కనీసం మరో రెండు నెలలైనా పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలని ఓటీటి ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ సినిమాలని కొనేందుకు రెడీగా ఉన్నాయి.

 

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కి పోటీగా అల్లు అరవింద్ ఆహా యాప్ ని రెడీ చేశాడు. వందశాతం తెలుగు కంటెంట్ తో వచ్చిన ఈ యాప్ కి ఇప్పుడిప్పుడే సబ్ స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అయితే వీరిని మరింతగా పెంచడానికి అల్లు అరవింద్ ప్లాన్ వేస్తున్నాడు. కరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయిన చిత్రాలని తన యాప్ కోసం కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. యాప్ కి యూజర్స్ ని పెంచాలంటే పెద్ద పెద్ద చిత్రాలని కొనాలని డిసైడ్ అయ్యాడు.

 

అందుకే కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్రాలని కొంటానని చెబుతున్నాడట. మరి అల్లు అరవింద్ ఆఫర్ కి ఎంత మంది ముందుకు వస్తారో చూడాలి. ఆహా యాప్ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ పక్కన నిలబెట్టడానికి అల్లు అరవింద్ బాగానే కృషి చేస్తున్నాడు. కొత్త సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అవుతే గనక ఆహాకి మంచి డిమాండ్ వస్తుంది. మరి సినిమా నిర్మాతలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో లేదో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: