టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉండే రేంజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు టాలీవుడ్ జనాలకు ఒక రకంగా పండగ వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆయన సినిమా విడుదల తర్వాత హిట్ అవ్వాలని పూజలు చేసే జనాలు కూడా ఉన్నారు. ఆ విధంగా చిరంజీవి తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు . వయసు పెరుగుతున్నా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు అనేది అర్ధమవుతుంది. 

 

మన తెలుగులో ఆయన తో సినిమా చేయడానికి ఎందరో దర్శకులు ఎదురు చూస్తూ ఉంటారు. వారిలో హరీష్ శంకర్, క్రిష్ కూడా ఒకరు. క్రిష్ ఎప్పటి నుంచో చిరంజీవి తో సినిమా చేయడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే ఈ కాంబినేషన్ ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళే విధంగా కనపడలేదు. ఇక హరీష్ శంకర్ కూడా చిరంజీవి తో సినిమా చెయ్యాలని ఉందని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. కాని అది సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం మాత్రం కనపడలేదు. సెట్స్ మీదకు వెళ్ళాలి అని అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాని చిరంజీవి అప్పటికి ఇంకా తిరిగి సినిమాల్లో అడుగు పెట్టలేదు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది కూడా. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి మావోయిస్ట్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగి అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: