తెలుగు సినిమా చరిత్రలో కొన్ని అద్భుత చిత్రాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి సినిమాలలో యమ లీల, ఘటోత్కచుడు వంటి సినిమాలు పిల్లలని, పెద్దలని కూడా ఎంతగానో అలరించాయి. అప్పట్లో యమలీల సినిమా గోల్డెన్ జూబ్లి కూడా జరుపుకుంది. దాని తరవాత వచ్చిన సూపర్ హిట్ సినిమా ఘటోత్కచుడు సినిమా, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

 

మనీషా ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చిన యమలీల సినిమా తర్వాత అతి పెద్ద హిట్ సాధించిన సినిమా ఘటోత్కచుడు. ఎస్ వి కృష్ణా రెడ్డి దర్సకత్వంలో అచ్చిరెడ్డి నిర్మాణ సారధ్యంలో కిషోర్ రాథీ సమర్పించిన ఈ చిత్రంలో అలీ, రోజా, కైకాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా నిర్మాత చిత్ర యూనిట్ సభ్యులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  ఈ సినిమా తర్వాత ఆలికి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. కైకాల సత్యనారాయణ నటన ఈ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవాలి. 

 

పిల్లలందరూ ఇప్పటికి ఈ సినిమా వస్తే దానిలో రోబో చేసిన యాక్షన్ కి టి వి లలో లీనమైపోతారు. ఈ సినిమా ప్రారంభంలో చూపించిన కురుక్షేత్ర సన్నివేశాలలో హీరోలు శ్రీకాంత్, రాజశేఖర్, చక్రపాణిలతో అప్పట్లోనే మల్టి స్టారర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు దర్శకుడు కృష్ణా రెడ్డి. ఒక ప్రత్యేక పాటలో నాగార్జున నటించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. రోజా నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో ఘటోత్కచుడు కి, చిన్న పాపకు మధ్య జరిగిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల మనసు కరిగించి కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి. ఘటోత్కచుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని గొప్ప అనుభూతి మిగిల్చింది అని నిర్మాత అచ్చిరెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: