ఆర్జీవి... ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఒక సైడు అంటే నేను ఒక్కడిని ఒక సైడు అనే వాడు కాబట్టి. ఏ విషయమైనా సరే కొత్త కోణంలో ఆలోచించి దానిపై తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులను చేస్తుంటాడు వర్మ. కొన్ని నిజానికి చాలా కాంట్రవర్సీలు అయిన సంగతి మనకు తెలిసిన విషయమే. ఇక అసలు విషయంలోకి వెళ్తే...

 


తాగినప్పుడు సమంతపై ఆర్జీవి పోస్ట్ చేశాడు అంటే అవునని నిజమే అంటున్నాడు ఆయన. అయితే ఈ విషయం ఇప్పుడు కాదులేండి. మజిలీ సినిమా విడుదల అయినప్పుడు విషయం. అసలుకి ఏం జరిగిందని విషయానికి వస్తే... సమంత చైతు కలిసి ఇదివరకు మజిలీ సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే తాను మద్యం సేవించి వారిపై ఒక పోస్ట్ చేసినట్లు కూడా వర్మ తెలిపాడు.

 


నిజానికి సమంత చైతు కలిసి నటించిన మజిలీ చిత్రం పెద్ద విజయాన్ని దక్కిందని చెప్పుకోవచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ చిత్రం ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ సమయంలో వర్మ ఒక పోస్ట్ చేశాడు. ఆ సినిమా ట్రైలర్ లో చైతూ, సమంత కెమిస్ట్రీకి అభిమానులు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతుంటే వర్మ కూడా ఆ పోస్టుకు సంబంధించి ఒక కామెంట్ చేశాడు. ప్రస్తుతం నేను నాలుగవ వోడ్కా లో ఉన్న... మందు లేకుంటే నేను వరస్ట్ గా ఉంటా... అంటూ తను కామెంట్ చేశాడు. అంతేకాకుండా నాకు ఆ ట్రైలర్ లో సమంత కంటే చైతు బాగా నచ్చాడు అని ఆయన తెలిపాడు. అంతేకాకుండా అందులో " నేను గే కాదు " అని కూడా తెలిపాడు. అయితే దీనికి నాగచైతన్య కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఏదైతే ఏముంది వర్మ ... మీరు అసలు మాట్లాడటమే మాకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటూ నాగచైతన్య వర్మకు రిప్లై ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: