టాలీవుడ్‌లో రెండు ద‌శాబ్దాల క్రితం ఓ యువ హీరోకు రెండు మూడు వ‌రుస హిట్లు రావ‌డంతో తిరుగులేని విధంగా దూసుకుపోయాడు. రెండు ద‌శాబ్దాల క్రితం వ‌చ్చిన ఓ సినిమా అయితే ఏకంగా యేడాది పాటు ఆడింది. ప్రేమ క‌థ‌ల్లో ఆ సినిమా ఎన్నో సంచ‌నాలు క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత స‌ద‌రు యువ హీరో ఓ పెద్ద బ్యాన‌ర్లో మ‌రో హిట్ సినిమాలో చేశాడు. మ‌రో రెండు పెద్ద సినిమాకు పోటీగా సంక్రాంతికి వ‌చ్చిన ఆ సినిమా సైతం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత స‌ద‌రు యువ హీరో ఆ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. 

 

వారిద్ద‌రు ఘాడంగా ప్రేమించుకోవ‌డంతో పాటు పిచ్చి పిచ్చిగా తిరిగేశారు. త‌ర్వాత అదే బ్యాన‌ర్ అదే హీరో, హీరోయిన్ల‌తో మ‌రో సినిమా చేసింది. ఆ సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. అయితే ఆ సినిమా టైంకు వీరిద్ద‌రి ప్రేమ పీక్స్‌కు వెళ్లిపోయింది. త‌ర్వాత ఇద్ద‌రి కెరీర్లు తిరోగ‌మ‌నంలోకి వెళ్లిపోయాయి. చాలా త‌క్కువ టైంలోనే అంద‌రూ స్టార్ హీరోయిన్ల‌తో సూప‌ర్ హిట్ సినిమాలు చేసిన ఆ క్రేజీ హీరోయిన్ ఫిజిక్‌లో కూడా భారీ మార్పులు రావ‌డం.. అటు కొత్త హీరోయిన్ల పోటీతో ఆమె అవ‌కాశాలు లేకుండా ప‌డిపోయింది.

 

ఇక స‌ద‌రు యువ హీరో కూడా ఛాన్సులు లేక దిగజారిపోయాడు. ఆ టైంలో స‌ద‌రు హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ఆ హీరో శారీర‌క అవ‌స‌రాలు కూడా తీర్చుకుని త‌ర్వాత ఇంట్లో వాళ్ల ఒత్తిడితో ఆమెను వ‌దిలేశాడు. ఈ క్రమంలోనే స‌ద‌రు హీరోయిన్ కుటుంబ స‌భ్యులు అప్ప‌ట్లో ఆ హీరోను ఓ చోట ప‌బ్లిక్‌గానే చావ చిత‌క్కొట్టార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ తంతు అంతా హైద‌రాబాద్‌లోనే జ‌రిగింద‌ట‌. ఏదేమైనా త‌ర్వాత ఆ హీరోయిన్ జీవితం పెద్ద విషాదంగా ముగిసింది. ఇక ఈ హీరో కూడా ఛాన్సులు లేక రెస్టారెంట్ వ్యాపారం పెట్టుకుని జీవ‌నం సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: