లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ తన అందచందాలతో తక్కువ సమయంలోనే అగ్రతారగా ఎదిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర అగ్ర హీరోలతో జత కట్టింది. బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ తో కలిసి నటించింది. తన 13 సంవత్సరాల సినీ కెరీర్లో కాజల్ అగర్వాల్ ఎన్నో పాత్రలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలను అందుకొంది. రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాలో రామ్ చరణ్ సరసన మిత్రవింద పాత్రలో నటించి దక్షిణ భారతదేశంలో ఎనలేని పాపులారిటీని తెచ్చుకుంది.


మగధీర సినిమా ని హిందీ లో చూసిన ప్రేక్షకులు కూడా ఆమె నటనకు ఫిదా అయిపోయారు. భారత దేశ వ్యాప్తంగా తనకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆర్య 2 సినిమాలో కాజల్ అగర్వాల్ పలికించిన హావభావాలు ప్రతి ఒక్కరి మనసులను నేరుగా తాకాయి. ఆమె రెండవ చిత్రమైనా చందమామ సినిమాలో నవదీప్ తో జతకట్టి తన అందాలతో కుర్రకారుకి నిద్రపట్టకుండా చేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మ్యాన్ చిత్రంలో చందమామ మెరిసే చందమామ అంటూ తన అందాలను బీభత్సంగా ఆరబోస్తూ తెగ పుట్టించేసింది.


మెగాస్టార్ చిరంజీవి తో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్ లో కాజల్ అగర్వాల్ చేసిన శృంగార భరితమైన నాట్యం ఇప్పటికీ ఎంతో మందిని అలరిస్తుంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలలో ప్రభాస్ సరసన జత కట్టి సాంప్రదాయకంగా, మోడర్న్ గా కనిపించింది. వీరా సినిమా లో మాస్ మహారాజా రవితేజ తో బీభత్సమైన రొమాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. కాజల్ అందంగా ఉండటంతో పాటు ఆమె ఎక్స్ప్రెషన్ పలికించడంలో దిట్ట. చీరకట్టులో కూడా కాజల్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఆమె తన సామాజిక మాధ్యమాలలో వేడి పుట్టించే సెక్సీ పిక్చర్స్ అప్లోడ్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: