లాక్ డౌన్ పిరియడ్ కొనసాగుతున్న పరిస్థితులలో ఖాళీగా ఉన్న హీరోలు అంతా తమ పెళ్ళిళ్ళ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే రానా తాను పెళ్ళి చేసుకోబోతున్న మిహీకా బజాజ్ ను అందరికీ పరిచయం చేస్తే ఏకంగా దిల్ రాజ్ శాస్త్ర బద్ధంగా పెళ్ళి చేసుకుని ఈ లాక్ డౌన్ పిరియడ్ లో మరొక సంచలన వార్త సృష్టించాడు.


ఈ పెళ్ళిళ్ళ ప్రభావంతో ఉత్సాహం తెచ్చుకున్న నిఖిల్ ఈరోజు పెళ్ళి చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఒకసారి నిశ్చయించుకున్న తన పెళ్ళి డేట్ వాయిదా పడటంతో నితిన్ కూడ త్వరలోనే తన కొత్త పెళ్ళి డేట్ ను ప్రకటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిచాలదు అన్నట్లుగా వచ్చే సంవత్సరం వరుణ్ తేజ్ నిహారికల పెళ్ళిళ్ళతో పాటు మెగా మేనల్లుడు సాయి తేజ్ పెళ్ళి కూడ ఉంటుంది అంటూ ఇప్పటికే వార్తలు గుప్పు మంటున్నాయి. 


ఇప్పుడు ఈ విషయాలు అన్నీ ప్రభాస్ పై ప్రభావం చూపెడుతున్నాయి అంటూ మళ్ళీ సరికొత్తగా ఇండస్ట్రీ వర్గాలలో ప్రభాస్ పెళ్ళి పై వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ లాక్ డౌన్ పిరియడ్ ముగిసే లాగానే ప్రభాస్ నుంచి కూడ అతడి పెళ్ళికి సంబంధించి ఒక న్యూస్ బయటకు వస్తుందని ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. 

 

దీనితో ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాల షూటింగ్ లు సినిమాల విడుదల కలెక్షన్స్ రికార్డుల సందడి ఏమాత్రం లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్న ఇండస్ట్రీ అంతా హీరోల పెళ్ళి వార్తలతో సంది చేస్తూ ఆ పెళ్ళిళ్ళ గురించి ఎవరి స్థాయిలో వారు ఊహాగానాలు చేసుకుంటూ ఈ లాక్ డౌన్ పిరియడ్ లో కాలం గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాకు కూడ చాల దూరంగా ఉండే ప్రభాస్ మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా తన ఇంటిలోనే కాలం గడుపు మళ్ళీ మరొకసారి తన పెళ్ళి పై మొదలైన వార్తలను వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: